యూఎస్ మార్కెట్ లో దుమ్మురేపుతున్న మహేష్ ” గుంటూరు కారం “.. మహేషా మజాకానా..!

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా మహేష్ హీరోగా శ్రీ లీలా మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామా ” గుంటూరు కారం “.

ఈ సినిమాపై మహేష్ అభిమానుల‌తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక ఈ సినిమా 12న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఈ సినిమా ఇప్పుడు తెలుగు స్టేట్స్ సహా యూఎస్ మార్కెట్ లో కూడా రికార్డ్ బుకింగ్స్ సెట్ చేస్తుంది.

ఇక‌ యుఎస్ లో అయితే సినిమా రిలీజ్ ఇంకా ఓ రోజు మిగిలి ఉండగానే 1 మిలియన్ డాలర్లు మార్క్ ని దాటేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. రీసెంట్ టైంలో కేవలం ప్రీమియర్స్ తోనే రికార్డ్ గ్రాస్ సైతం చేస్తున్న అతి కొద్ది సినిమాలలో ఒకటిగా గుంటూరు కారం నిలిచింది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.