ఈ ఫోటోలో మెడల్ అందుకుంటున్న టాలీవుడ్ హీరోని గుర్తు పట్టారా.. స్టార్ ఇంటికి అల్లుడు కూడా..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన చైల్డ్ హుడ్ ఫొటోస్ తాలూకా పిక్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. రీసెంట్గా ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇక్కడ ఈ ఫోటోలో మీరు చూస్తున్న ఇతగాడు ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరో ….

సూపర్ డూపర్ హిట్లు అందుకున్నాడు అని చెప్పలేము కానీ మంచి సినిమాలతో అందరిని మెప్పించాడు. ప్రజెంట్ అవకాశాలు లేక అల్లాడిపోతున్నారు . అంతేకాదు స్టార్ హీరోకి బావ .. అంతేకాదు ఒక సీనియర్ హీరోకి అల్లుడు కూడా .. ఇప్పటికే ఈయన ఎవరో అర్థమైంది అనుకుంటాను .. యస్ మీ గెస్సింగ్ కరెక్ట్ . ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని హీరో మరెవరో కాదు సుధీర్ బాబు . ఘట్టమనేని ఇంటి అల్లుడు.

మన మహేష్ బాబుకి బావ.. సూపర్ స్టార్ కృష్ణ కి అల్లుడు . కాగా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి తనదైన స్టైల్ లో గుర్తింపు సంపాదించుకున్న సుధీర్ బాబు పలు గేమ్స్ లో కొన్ని అవార్డులు కూడా తీసుకున్నాడు .ఇదే క్రమంలో ఆయన మెడల్ అందుకుంటున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బ్యాడ్మింటన్‌లో నేషనల్ ప్లేయర్ కూడా అయిన సుధీర్ కి ఆ తర్వాత క్రికెట్‌లో కూడా ప్రవేశం ఉంది. ఇక ఫిట్‌నెస్ విషయంలో ఇప్పటి హీరోలు చాలా మంది సుధీర్‌ను చూసి వావ్ అంటారు. ఒకప్పుడు బ్యాడ్మింటన్ ఆడుతున్నపుడు ఆంధ్రప్రదేశ్‌లో నంబర్ వన్ ర్యాంకు కూడా సాధించాడు.