చరిత్ర తిరగరాయబోతున్న రాజమౌళి.. మహేశ్ సినిమాలో ఆ ఇండోనేషియన్ హీరోయిన్..!?

రాజమౌళి .. టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకధీరుడు గా పాపులారిటీ సంపాదించుకున్న వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్. ఆయన ఏం చేసినా అది సంచలనంగానే ఉంటుంది. మరీ ముఖ్యంగా బాహుబలి తర్వాత ఆయన పేరుని ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోయేలా చేసుకున్నాడు. కాగా రీసెంట్గా ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్ని ప్రభంజనాలు సృష్టించిందో మనకు తెలిసిందే. అంతేకాదు ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబు తో ఓ సినిమాను తెరకెక్కించాలని డిసైడ్ అయ్యాడు .

ఈ సినిమాకి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయింది . త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు రాజమౌళి . ఇదే క్రమంలో ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు సెలెక్ట్ అయ్యారు అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రశ్నలు వినిపిస్తున్నాయి . నిన్న మొన్నటి వరకు ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, కత్రినా కైఫ్ లాంటి స్టార్ బ్యూటీల పేర్లు వినిపించాయి.

అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమా కోసం ఇండోనేషియా హీరోయిన్ రంగంలోకి దించుతున్నాడట రాజమౌళి. ఆమె పేరు… చెల్సియా ఇస్లాన్. ఇప్పటికే ఆమె కొన్ని హాలీవుడ్ చిత్రాల్లో న‌టించింది. రీసెంట్ గా ఆమెను స్క్రీన్ టెస్ట్ కూడా చేశార‌ని, ఈ సినిమాలో ఆమె వర్క్ చేయటం కన్ఫర్మ్ అని తెలుస్తోంది. అయితే చెల్సియాని హీరోయిన్ పాత్ర కోసం ఎంచుకొన్నారా, లేదంటే కీల‌క పాత్ర కోసం తీసుకొన్నారా? అనేది తెలియాల్సివుంది. ఇప్పటివరకు ఏ డైరెక్టర్ చేయని బిగ్ సాహసం చేయబోతున్నాడు మన రాజమౌళి . ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!