అడవి మధ్యలో ఆ పని చెయ్యడం బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటున్న మెగా డాటర్.. పోస్ట్ వైరల్..!

మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ పలు సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా పాపులారిటీ దక్కలేదు. ఇక ఇటీవలే జొన్నలగడ్డ చైతన్యని వివాహం చేసుకుని అనంతరం విడాకులు సైతం తీసుకుంది. ఇక ప్రస్తుతం వీరు ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు.

అలాగే నిహారిక ఇటీవలే ఓ నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించి ఇండస్ట్రీలో కొనసాగుతుంది. పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కిస్తూ తన టాలెంట్ ని చూపిస్తుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక పోస్ట్ పెడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఇక తాజాగా నిహారిక తన ఇన్స్టాల్ ఓ ఆసక్తికర పోస్ట్ ని షేర్ చేసింది.

అందులో వెదురు బొంగులో వండుకుని తిన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా..” మేము అడవి మధ్యలో వెదురు బొంగులో వంట చేసుకున్నాము. నాకు ఇదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ష అంటు క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది.