విడాకులు తీసుకున్న సమంత కోసం అలాంటి నిర్ణయం తీసుకున్న వెన్నెల కిషోర్.. చూసి బుద్ధి తెచ్చుకోండి..!!

సినిమా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా నాగచైతన్య సమంతల విడాకుల మ్యాటర్ . వీళ్లు ప్రేమించుకున్నప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిందో కానీ విడాకులు తీసుకుంటే మాత్రం డబల్ కాదు ట్రిపుల్ స్థాయిలో జనాలు చర్చించుకుంటున్నారు. కాగా రీసెంట్గా ఈ మేటర్ లోకి వెన్నెల కిషోర్ ఇన్వాల్వ్ అయ్యాడు. ఇన్నాళ్లు సమంత నాగచైతన్యలకు సంబంధించిన వార్తలు వైరల్ అయ్యాయి.

కానీ ఇప్పుడు ఏకంగా వెన్నెల కిషోర్ కి సంబంధించిన వార్తలు కూడా వినిపిస్తున్నాయి . వెన్నెల కిషోర్ కి సమంత చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్ మంచి జాన్ జిగిడి దోస్తులు ..అతి తక్కువ టైంలోనే బాగా క్లోజ్ అయిపోయారు. తన ఫ్రెండ్ కి విడాకులు ఇచ్చిన కారణంగా ఏకంగా నాగచైతన్యతో సినిమాలు చేయను అంటూ శపధం చేసుకున్నాడట వెన్నెల కిషోర్. అయితే విడాకుల తర్వాత వెన్నెల కిషోర్ కస్టడీ -బంగార్రాజు సినిమాలో నటించాడు .

బంగార్రాజు సినిమా వాళ్లు విడాకులు తీసుకోక ముందే సైన్ చేశారట. కస్టడీ సినిమా కూడా మోసం చేయించి డైరెక్టర్ సైన్ చేయించారట. నాగచైతన్యతో ఎలాంటి సీన్స్ ఏవి నీకు రాయము అంటూ చెప్పి సైన్ చేశాక ఆయనతో సీన్స్ యాడ్ చేశారట. సినిమాపై ఉన్న గౌరవంతో ఆయనతో తెరపై నటించాడే తప్పిస్తే తెర వెనక మాత్రం ఒక్క ముక్క కూడా మాట్లాడలేదట. అంతేకాదు ఫ్యూచర్లో వచ్చే సినిమాల్లోనూ నాగచైతన్యతో నటించను అంటూ భీష్మించుకుని కూర్చున్నాడట వెన్నెల కిషోర్ . దీంతో సామ్ ఫ్యాన్స్ ఈ వార్త ను ట్రెండ్ చేస్తున్నారు . కనీసం వెన్నెల కిషోర్ ని చూసి బుద్ధి తెచ్చుకోండి మిగతా హీరోలు అంటూ మండిపడుతున్నారు..!!