‘ సలార్ ‘ వరల్డ్ వైడ్ టార్గెట్ ఫిక్స్.. కేజియ‌ఫ్ టార్గెట్‌ను మించి రాబ‌టాలి..!!

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన మూవీ సలార్‌ క్రిస్మస్ కానుకగా డిసెంబ‌ర్ 22న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, ట్రైలర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ లను రూపొందించిన ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ రూపొంద‌టంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలను ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు మూవీ చూస్తామాఅని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి భారీ బిజినెస్ జరిగింది.

అందుకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో మీడియాలో వైరల్ అవుతున్నాయి. సలార్ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఇవెన్‌ టార్గెట్ ఏకంగా రూ.800 కోట్లు అని తెలుస్తుంది. ఏరియా వైజ్‌గా చూసుకుంటే తెలంగాణలో.. సలార్ మూవీ రైట్స్ రూ.65 కోట్లకు అమ్ముడు పోయాయ‌ట‌. ఈ లక్ష్యాన్ని చేదించాలంటే మూవీ కచ్చితంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూలు సాధించాలి. ఇక ఆంధ్రాలో సలార్ థియేట్రిక‌ల్ రైట్స్ రూ.95 కోట్లకు అమ్ముడుపోయాయి. అంటే ఆంధ్రాలో రూ.150 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకోవాల్సి ఉంటుంది.

తెలంగాణ, ఏపీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోను బ్రేక్ ఈవెన్ రూ.250 కోట్లు కాగా.. కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇతర సౌత్ స్టేట్స్ లో నిర్మాతలు సొంతంగా ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. అక్కడి వాల్యూడ్ బిజినెస్ ప్రకారం మూడు రాష్ట్రాలకు కలిపి సినిమాకి దాదాపు రూ.65 కోట్ల బిజినెస్ జరిగింది. అంటే ఈ మూడు రాష్ట్రాల్లోనూ రూ.130 కోట్ల గ్రాస్‌వ‌సుళ్ళు కొల్లగొట్టాల్సి ఉంది. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా స‌లార్‌ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.800 కోట్ల గ్రాస్‌ రాబట్టాలి.

ఇందులో సౌత్ ఇండియా నుంచి రూ.380 కోట్ల గ్రాస్, నార్త్ ఇండియా నుంచి రూ.230 కోట్ల గ్రాస్ కొల్లగొట్టాలి. సౌత్ నార్త్ రెండు కలిపితే రూ.610 కోట్ల గ్రాస్ రావాలి. ఇక ఓవర్సీస్ లో అయితే మూవీ పబ్లిసిటీ ప్రింట్ ఖర్చులతో కలిపి రూ.75 కోట్లకు బిజినెస్ జ‌రిగింది. అక్కడ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 150 కోట్లు గ్రాస్ సొంతం చేసుకోవాలి. అలా మొత్తం పాన్ ఇండియా లెవెల్ లో ఈ మూవీ రూ.800 కోట్ల గ్రాస్ సొంతం చేసుకోవాలి. రూ. 400 కోట్ల షేర్ సాధించాల్సి ఉంటుంది. ఇలా భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ తో బాక్స్ ఆఫీస్ భ‌రిలో దిగుతున్న డైనోసార్ స‌లార్‌తో బ్రేక్ ఈవెన్ సాధించి నిర్మాతలకు లాభాలు అందిస్తాడో.. లేదో.. వేచి చూడాలి.