టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్న రైతుబిడ్డ.. ఏకంగా రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసాడుగా..

నిన్న మొన్నటి వరకు ఎంతో రసవ‌త‌రంగా సాగిన బిగ్‌బాస్ సీజన్ 7 రియాలిటీ షో ఎట్టకేలకు ముగిసింది. గ్రాండ్ ఫినాలే లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా, అమర్ దీప్ ర‌న‌ర‌ప్‌గా నిలిచారు. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత వీరికి ఆడియన్స్ ఓ రేంజ్ లో ఆహ్వానం ప‌లికారు. ఇకపోతే అమర్‌ భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు అందుకుంటాడో తెలియదు కానీ.. పల్లవి ప్రశాంత్‌కి మాత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస అవకాశాలు క్యూ క‌డుతున్నాయి. మన టాలీవుడ్ లోనే తెలంగాణ స్లాంగ్‌లో వచ్చే సినిమాలు పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్స్‌గా నిలుస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా దానికికి ఎన్నో ఉదాహరణలు చూసాం. టాలీవుడ్ స్టార్ హీరోస్ కూడా తెలంగాణ యాస రెగ్యులర్గా వాడుతున్నారు.

Pallavi Prasanth Wins Cash, Car and Gold and Diamond BB విన్నర్ ఎంత  గెలుచుకున్నాడంటే?

కేవలం తెలంగాణ యాస‌ మాత్రమే కాదు.. ప్రేక్షకులకు కొత్తగా అనిపించే స్లాంగ్ ఏది ఉన్నా ఆడియన్స్ కు ఆ సినిమాలు బాగా నచ్చేస్తున్నాయి. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజెర్ సినిమా తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుస‌నా తో ఓ సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి సినిమా షూటింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో బిగ్ బాస్ కంటెస్టెంట్ అర్జున్ అంబటి ఓ పాత్రకి సెలెక్ట్ అయ్యాడు. స్వయంగా డైరెక్టర్ బుజ్జిబాబు బిగ్ బాస్ స్టేజ్ మీద ఈ విషయాన్ని ప్రకటించాడు. ఇప్పుడు రామ్ చరణ్ కి జ‌హ‌య‌న‌టుడిగా పల్లవి ప్రశాంత్ ని తీసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

Pallavi Prashanth: పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రైతుబిడ్డ పల్లవి  ప్రశాంత్? - Telugu Varadhi

పల్లవి ప్రశాంత్ తన ఎమోషన్స్ తో జనాలకు కంటతడి పెట్టించాడు. కాబట్టి పల్లవి ప్రశాంత్ ఎమోషనల్ రోల్స్‌లో అయితే కచ్చితంగా సక్సెస్ అవుతాడని.. మేకర్స్ భావిస్తున్నారట. ఈ సినిమాలో పల్లవి ప్రశాంత్ నటన‌కి పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా ఎమోషనల్ రోల్స్ లో పల్లవి ప్రశాంత్ కు మరిన్ని అవకాశాలు వస్తాయి. ఇక దీంతోపాటే పవన్ కళ్యాణ్ ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాలో నటించే ఛాన్స్ పల్ల‌వి ప్రశాంత్ కొట్టేసాడని గతంలోనే వార్తలు వైరల్ అయ్యాయి. మరికొన్ని సినిమాల్లో కూడా పల్లవి ప్రశాంత్‌ను తీసుకోవడానికి మేకర్స్ ఆలోచనలో ఉన్నారట. తమ సినిమాల్లో పల్లవి ప్రశాంత్ ఉన్నాడంటే ఆ సినిమాకు మరింత హైప్ పెరుగుతుందని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక‌ ప్రశాంత్ ముందు ముందు ఏ రేంజ్ లో సినిమాల్లో నటిస్తాడో చూడాలి.