ప్రభాస్ ” సలార్ ” మూవీలో ఆ ట్విస్టులు మామూలుగా ఉండవా… ఆ సినిమానే తలదన్నే సీన్లు అట..!

మరో 72 గంటల్లో థియేటర్లలో విడుదల కాలున్న సలార్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో బాహుబలి ని మించిన ట్విస్టులు ఉండబోతున్నట్లు సమాచారం. ఇక దేవా, వరద రాజమన్నార్ విడిపోవడానికి కారణమయ్యే హార్ట్ ట్విస్ట్ మామూలుగా ఉండదట. బాహుబలి సిరీస్ సినిమాలను మించేలా ఈ మూవీ ఉండబోతున్నట్లు టాలీవుడ్ టాక్.

అలాగే ఈ సినిమా పార్ట్ 1 ను మించి పార్ట్ 2 ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో ప్రేక్షకులను ఊహించని ట్రిస్టులతో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారట. సలార్ పార్ట్ 2 సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ ఇక్కడ ఉన్నట్లు సమాచారం. ఇక సలార్ కొత్త ట్రైలర్ ప్రేక్షకులని ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక రిలీజ్ ట్రైలర్లో ప్రభాస్కు ఎక్కువగా ప్రాధాన్యత దక్కడం ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగించింది.

అలాగే సలార్ మూవీలో గూస్ బంప్స్ సీన్స్ మాత్రం మామూలుగా ఉండవని సమాచారం. అలాగే ఈ మూవీ 2 గంటల 55 నిమిషాల నిడివి తో తెరకెక్కనుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అనంతరం భారీ కలెక్షన్స్ రాబడుతుందని మేకర్స్ గట్టి నమ్మకం తో ఉన్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ అనంతరం ఏ విధమైన టాక్ అందుకుంటుందో చూడాలి మరి.