” యానిమల్ ” మొదటి రోజు కలెక్షన్స్ పై తీవ్ర చర్చలు..‌.!!

రణ్‌బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” యానిమల్ “. ఈ సినిమా నేడే ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమాకు మొదటి నుంచి కూడా పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యింది. ఇక తప్పకుండా ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు. రెండేళ్ల ఎదురుచూపుల నేపథ్యంలో ఈ సినిమా నేడు రిలీజ్ అయింది.

ఇక ఈ సినిమా సౌత్ లో వందల కోట్లు వసూళ్లు నమోదు చేస్తుందని.. మొత్తం మీద ఈ సినిమా 1000 కోట్ల వసూళ్లను టచ్ చేసే అవకాశం పుష్కలంగా ఉందంటూ చాలామంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇక ముఖ్యంగా మొదటి రోజు వసూళ్ల విషయంలో ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తునే ఎదురుచూస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 నుంచి 65 కోట్ల వరకు వసూళ్ల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

ఒక్క బాలీవుడ్ లోనే కాకుండా అనేక భాషల్లో ఈ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. అందుకే ఈ సినిమాకి ఆ రేంజ్ లో వసూళ్లు నమోదు కాబోతున్నాయి. చాలా చోట్ల పెయిడ్ ప్రీమియర్ షోలు వేయడం జరిగింది. కనుక ఈ సినిమాకు వసూళ్లు విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు అన్నట్లు గా ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భారీ ఎత్తున కలెక్షన్స్ సాధించబోయే ఈ సినిమాకి మొదటి రోజు కలెక్షన్స్ చాలా ముఖ్యం. మరి మొదటి రోజు కలెక్షన్స్ మేకర్స్ భావించినట్లు వస్తాయో లేదో చూడాలి.