మరో డైరెక్టర్ కి ఓకే చెప్పిన పవన్.. ఈ సినిమా అయిన పట్టాలు ఎక్కుతుందా అంటూ కామెంట్లు…!!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరు. ఈయన చేసిన సినిమాలు అప్పట్లో ఏ రేంజ్ సెన్సేషన్ సృష్టించాయో మనందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం ఒకపక్క సినిమాలను మేనేజ్ చేస్తూనే మరో పక్క రాజకీయంలో దూసుకుపోతున్నాడు పవన్. ఇక ఈ క్రమంలోనే ఈయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటుగా అటు పొలిటికల్ మద్దతు కూడా గట్టిగా ఉంది.

ఇక ప్రస్తుతం పవన్ ఓకే చేసిన సినిమాలన్నీ వెయిటింగ్ లిస్టులోనే ఉన్నాయి. అయితే ఈయన రీసెంట్ గా బ్రో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చినప్పటికీ… ప్రేక్షకులని అలరించలేకపోయారు. పవన్ కి తగ్గ స్టోరీ కాకపోవడం కారణంగా పవన్ పేరు కూడా దెబ్బతినిందనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈయన ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ లాంటి సినిమాలు చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాలు దాదాపు రిలీజ్ కి రెడీ అయినట్లే కనిపించినప్పటికీ.. ఆంధ్రాలో ఎలక్షన్స్ ఉండడంతో ఈ సినిమాలు పోస్ట్ ఫోన్ అయ్యాయి. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. పవన్ మరో డైరెక్టర్ కి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఆ దర్శకుడు మరెవరో కాదు సురేందర్ రెడ్డి. ఇక వీరి కాంబోని ఎప్పుడో అనౌన్స్ చేయాల్సి ఉంది కానీ.. అనేక కారణాలవల్ల ప్రస్తుతం ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ కి సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇక ఈ వార్త చూసిన ప్రేక్షకులు.. ఈ సినిమా అయినా పట్టాలు ఎక్కుతుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.