సిగ్గుగా అనిపించడం లేదా.. ఇదేమైనా జాతీయ సమస్య.. త్రిష సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..

సౌత్ స్టార్ట్ బ్యూటి త్రిషకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల సోషల్ మీడియాలో తన గురించి తప్పుడు వార్తలు రాస్తున్న వారిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. దేశంలో ఇంకేమి సమస్యలు లేవా.. అందరూ నాపై పడి ఏడుస్తున్నారు.. మీకు సిగ్గుగా అనిపించడం లేదా అంటూ వైలెంట్ గా రియాక్ట్ అయింది. గత కొంతకాలంగా త్రిష వ‌య‌స్సుకి సంబందించి ఎన్నో వార్త‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

Trisha Movies, News, Photos, Age, Biography

40 ఏళ్ళ వయసులోను వరుస ఆఫర్స్ దక్కించుకుంటున్నారని ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంలో త్రిష ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫీలవుతుంటే కొందరు మాత్రం ఇదే టాపిక్ పై ఆమెను విపరీతంగా ట్రోల్స్ చూస్తున్నారు. ఈ వార్తలు చాలా రోజులుగా వైరల్ అవుతున్న త్రిష ఏ మాత్రం స్పందించలేదు. కానీ ఇటీవల ఆ కామెంట్స్ మితిమీర‌డంతో ఆమె చాలా కోపంగా రియాక్ట్ అయి వారందరిపై ఫైర్ అయింది. ఆమె వయసు పై దారుణంగా ట్రోల్స్ చేయడంతో దేశంలో వేరే సమస్యలు లేనట్టు.. నా వయసు గురించి వార్తలు రాస్తున్నారు.. ? ఇప్పుడు ప్రతి ఒక్కరికి నా వయసు ఒక జాతీయ సమస్య అయిపోయింది.

Tʀɪsʜ 💕 (@trisha__empire) • Instagram photos and videos

40 ఏళ్ళ‌ తర్వాత ఎవరు సినిమాల్లో నటించడం లేదా..? ఎవరు హీరోయిన్గా చేయడం లేదా..? మీకు ఏమైనా సిగ్గుగా అనిపించడం లేదా..? ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎంతోమంది 40 దాటిన హీరోయిన్స్‌లా నటిస్తున్నారు. నేనేం ఫస్ట్ హీరోయిన్ కాదు కదా. నాకు వరస అవకాశాలు రావడం అసలు నచ్చడం లేదా..? అందుకే నాపై ఇలా పిచ్చిపిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. నేను ఒక నటిని నట్టిగానే నా చివ‌రి శ్వాస వరకు ఉంటా. అయినా నటనకు, వయసుకు సంబంధం ఏంటి..? ఆ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఎలా అంటూ త్రిష ఫైర్ అయ్యింది. ప్రస్తుతం త్రిష చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.