” ఆ స్టార్ హీరో కోసం నా దగ్గర స్క్రిప్ట్ రెడీగా ఉంది “.. మెహర్ రమేష్ సెన్సేషనల్ కామెంట్స్..!!

భోళా శంకర్ సినిమాతో చిరంజీవిని డైరెక్ట్ చేసే సువర్ణ అవకాశం మెహర్ రమేష్‌కి వచ్చింది. కానీ ఆ ఛాన్స్ ని సరిగ్గా వినియోగించుకోలేదు మెహర్. ఈ సినిమా బోల్తా కొట్టడంతో.. మెహర్ రమేష్ పై అనేక ఆరోపణలు సైతం వచ్చాయి. ఇక తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూ కి హాజరయ్యాడు. ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

ఈయన మాట్లాడుతూ.. ” నేను ఒకరోజు పవన్ కళ్యాణ్ సినిమాకి దర్శకత్వం వహిస్తాను అని అన్నారు. స్క్రిప్ట్ కూడా రెడీ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే నాకు పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు వస్తాయి అన్నారు. కానీ నేను చేసిన సినిమాలన్నీ పెద్ద ఫ్లాపులుగా నిలిచాయి ” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక వరుస సినిమాలను లైన్ లో పెట్టిన పవన్ కళ్యాణ్… మెహర్ రమేష్ కి అవకాశం ఇస్తాడో లేదో చూడాలి. ఇక ఈయన వ్యాఖ్యలు చూసిన ప్రేక్షకులు… ఇచ్చిన సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయావు కానీ… ఇప్పుడు నీకు పవన్ కళ్యాణ్ తో సినిమా అవకాశం కావాలని ఎలా కోరుకుంటున్నావు.. అంటూ మండిపడుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.