సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా యానిమల్ . రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నమోదు చేసుకుంది . మరీ ముఖ్యంగా సినిమాలో ఫుల్ వైలెన్స్ రొమాంటిక్ సీన్లతో అదరగొట్టేసాడు సందీప్ రెడ్డివంగా . సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు థియేటర్లో జనాలు సీట్లలో కూర్చోలేకపోతున్నారు..
అంటే పర్ఫామెన్స్ ఎంత హై వోల్టేజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు . అయితే సందీప్ రెడ్డివంగా సినిమా అంటే కచ్చితంగా జనాలు ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తారు . దానికి ట్రిపుల్ స్థాయిలో ఈ సినిమా ఉంది. ఈ సినిమా చూడడానికి వెళ్లే వాళ్ళు కచ్చితంగా పేపర్లు తీసుకెళ్లండి . సందీప్ రెడ్డి డైరెక్షన్.. రణ బీర్ యాక్షన్.. ఆ బ్యాక్ గ్రముడ్ మ్యూజిక్ కి..ఆ ఊపుకి అరిచి అరిచి పేపర్లు ఎగరవేయాలి అనిపిస్తూ ఉంటుంది .
ఫుల్ సినిమా ఎంజాయ్ చేయాలి అంటే కచ్చితంగా మీరు థియేటర్స్ కి పేపర్స్ తీసుకువెళ్లండి అంటూ ఫ్యాన్స్ సజెస్ట్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాతో మరో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పక్క తప్పదు. చూడాలి మరి ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..?