NTR31లో విలన్ గా ఆ స్టార్ హీరో.. గూస్ బంప్స్ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్..!!

టాలీవుడ్ యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ “దేవర” అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే . కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 5 2024న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు . ఎన్టీఆర్ కెరియర్ లోనే 31వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి .

అంతేకాదు ఈ సినిమా ద్వారా గ్లోబల్ స్థాయిలో ఆయన పేరు మరోసారి మారం మ్రోగిపోవడం పక్కా అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో అమితాబచ్చన్ ను విలన్ గా చూస్ చేసుకున్నారట ప్రశాంత్ నీల్. సినిమాలో విలన్ అంటే ఎంత మాస్ లుక్ లో ఉంటారో అర్థం చేసుకోవచ్చు .

అయితే అమితాబచ్చన్ లాంటి క్లాస్ హీరోని ఈ సినిమాల్లో మాస్ యాంగిల్ లో చూపిస్తే జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారో అన్నది ప్రశ్నర్ధకంగా ఉంది . మరోపక్క టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా హీరో అయిన ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ బడా హీరో విలన్ గా నటిస్తూ ఉండడం అభిమానులకు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. దీనితో ఈ సినిమాకి సంబంధించిన ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!