టికెట్ టూ ఫినాలేలో గెలిచి నేరుగా టాప్ 5కి వెళ్లిన ఆ కంటిస్టెంట్.. అసలు ఊహించలేరు..?!

బిగ్‌బాస్ సీజన్ 7 ఫైనల్ కు చేరడంతో టాస్కులు మరింత రసవత్తరంగా సాగుతున్నాయి. టికెట్ టూ ఫినాలే అస్త్ర.. పోటీ చివరి దశకు చేరుకుంది. బిగ్‌బాస్ పెట్టిన గేమ్ లో ఎక్కువగా అర్జున్, రైతుబిడ్డ టాస్కులు గెలుచుకుంటే పాయింట్లు సంపాదించారు. అమర్ మాత్రం అందరి దగ్గర పాయింట్లు అడిగి తీసుకొని టాప్ స్థానంలో నిలబడ్డాడు. నిజానికి అతనికి ఎవరు పాయింట్లు ఇవ్వకపోయినా టాప్ మూడు, నాలుగు స్థానాల్లో ఉండేవాడు.

వామ్మో నీకన్నా అమర్ దీప్ నయం.. రైతు బిడ్డ పై విషం కక్కిన అర్

కానీ ఎక్కడ రేసులో నుంచి అవుట్ అయిపోతాను అనే భయంతో అమర్ అందరినీ బతిమిలాడుతున్నాడు. అయితే కేవలం రెండు టాస్క్‌ల‌లో మాత్రమే గెలిచిన అమర్‌.. అందరూ ఇచ్చిన పాయింట్లతో స్కోర్ బోర్డ్ లో టాప్ లో ఉన్నాడు. కానీ అర్జున్ ఎవరి దగ్గర ఒక పాయింట్ కూడా తీసుకోకుండా ఐదు ఆటలో గెలిచాడు. దీంతో సోషల్ మీడియాలో అర్జున్‌ టికెట్‌టూ ఫినాలే గెలిచాడంటూ న్యూస్ వైరల్ అవుతుంది. అంటే అతడు టాప్ ఫైవ్ లో అడుగుపెట్టినట్లే. అయితే ప్రస్తుతం అర్జున్ నామినేషన్ లో ఉన్నాడు.

ఎలిమినేషన్ గండాన్ని దాటుకుని అర్జున్ తర్వాతి వారానికి అడుగుపెడితే.. ఫినాలేలా అర్జున్ కచ్చితంగా ఉంటాడు. నామినేషన్ లో ఎంత నెగెటివిటీ ఉన్న టికెట్‌టూ ఫినాలేలో మాత్రం టాస్కులతో తన సత్తా చాటుకున్నాడు అర్జున్. ఎవరి సహాయం లేకపోయినా ఒంటరిగా పోరాడి ఐదు టాస్కులను గెలిచాడు. దీంతో ఈ వారం అర్జున్ ఈజీగా సేవ్ అవుతాడు.. టాప్ 5లో నిలుస్తాడు అంటూ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ టికెట్‌టూ ఫినాలే అస్త్రాని అర్జున్, అమర్‌లో ఎవరు సొంతం చేసుకుంటారు బిగ్ బాస్ నిర్ణయం చెప్పేంతవరకు వేచి చూడాలి