సంబరాల‌లో మునిగితేలుతున్న‌ బండ్ల గణేష్.. కార‌ణం ఏంటో తెలుసా..?!

తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండడంతో ఆ పార్టీ నాయకుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్ చాలా సంతోషంగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ విజయంపై ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ వేళ అయినా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ అందరిని ఆకర్షిస్తుంది.

” అరె ఏమైందీ… ఈ మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది? హ…హ….హ…” అంటూ బండ్ల గణేష్ తెగ సంబరపడిపోతున్నాడు. ఇక ఈ స్టోరీ పై ప్రేక్షకులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇటీవలే ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడాడు బండ్ల గణేష్.

డిసెంబర్ 9న మీరు కూడా ఎల్బి స్టేడియం కు వస్తారా? అని మీడియా ప్రతినిధి అడిగితే…” నేను 7 నుంచి అక్కడే పడుకుంటా, మీరు 9న రండి ” అంటూ వెటకారంగా సమాధానమిచ్చాడు. ఇక బండ్ల గణేష్ చెప్పిన సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే… ఫలితాలు వచ్చే దాకా కాస్త ఓపిక పట్టాలి అంటూ బండ్లన్న ని తిట్టిపోస్తున్నారు. ప్రస్తుతం ఈయన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.