ఆ తెలుగు హీరో.. డబ్బులు ఇచ్చి యానిమల్ సినిమాకు పాజిటివ్ రివ్యూలు రాయిస్తున్నారా..?

సోషల్ మీడియాలో సినిమాకి రివ్యూ ఇచ్చే జనాలు ఎక్కువ అయిపోతున్నారు . పలు మీడియా ప్లాట్ఫామ్స్ సినిమాలకు రివ్యూలు ఇస్తూ సినిమా ఎలా ఉంది..? ఏంటి..? అనే విషయాలను ముందుగానే జనాలకు తెలియజేస్తుంది . ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు చూడడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తుంటే .. మరికొన్ని సినిమాలు చూడడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు . అయితే ముందుగానే ఇలా సినిమాలకు రివ్యూలు ఇవ్వడం వల్ల సినిమా ఇండస్ట్రీ నష్టపోతుంది అని లబోదిబోమంటూ చాలామంది మేకర్స్ చెప్పుకొస్తున్నారు.

అయితే యానిమల్ సినిమా కోసం సందీప్ రెడ్డి వంగ కొందరితో మాట్లాడి డీల్ కుదుర్చుకొని .. సినిమాలకు పాజిటివ్ రివ్యూలు రాసే విధంగా సెట్ చేసుకున్నాడు అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ సినిమా కొద్దిసేపటికి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది .

అయితే ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ సినిమాకి సంబంధించి నెగటివ్ టాక్ మాట్లాడటం లేదు. దీంతో ఈ సినిమా కోసం సందీప్ రెడ్డి వంగ కొందరి చేత పాజిటివ్ రివ్యూలు రాయించుకొని దాని ద్వారా పబ్లిసిటీ సంపాదించుకుంటున్నాడు అని ప్రచారం జరుగుతుంది. లేకపోతే ఈ సినిమా కి ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా రాకుండా ఉండడం నిజంగానే ఆశ్చర్యకరంగా ఉంది అంటూ పలువురు చెప్పుకొస్తున్నారు .అంతేకాదు అలా తెలుగు ఇండస్ట్రీలో ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూలు ఇవ్వడం వెనక ఓ బడా తెలుగు హీరో హస్తం కూడా ఉంది అంటూ మాట్లాడుకుంటున్నారు..!!