నయన్ కి కాస్ట్‌లి కార్ గిఫ్ట్ గా ఇచ్చిన విగ్నేష్ శివన్.. ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోది..!!

లేడీ సూపర్ స్టార్ నయనతారకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 39 ఏళ్ళ వయసు పైబడుతున్న ఇంకా అదే క్రేజ్తో వర్ష సినిమా ఆఫర్లను అందుకుంటున్న ఈ ముద్దబొమ్మ ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టింది. కాగా ఇటీవల ఇమె పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులతో పాటు ఫ్యాన్స్ కూడా ఈ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్గా జరుపుకున్నారు. ఇక నయనతార, విగ్నేష్ శివ‌న్ ఇద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

చాలా ఏళ్లపాటు రిలేషన్షిప్ లో ఉన్న ఈ జంట కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకున్నారు. అప్పట్లో వీరిద్దరి ప్రేమకు సంబంధించిన ఎన్నో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా జరిగిన నయన్ పుట్టిన రోజు సందర్భంగా విఘ్నేష్‌.. భార్యకు ఒక కాస్ట్లీ గిఫ్ట్ ను ప్రజెంట్ చేశాడట. నయన్ పుట్టిన రోజును సెలబ్రేట్ చేస్తూ ఆమెకు ఎంతో ప్రేమతో మెర్సడేస్ బెంజ్ మే బ్యాక్ కారును ప్రెసెంట్ చేసినట్లు తెలుస్తుంది.

అయితే ప్రస్తుతం ఏం న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ కార్ ద్వారా ఎంత అనే అంశంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కాగా ఈ కార్‌ విలువ దాదాపు మూడున్నర కోట్ల వరకు ఉంటుందని టాక్. తన భర్త తనకి ప్రేమతో ఈ కారును కొనిచ్చారు అంటూ.. నయనతార స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్‌లు వైరల్ గా మారాయి. ఇక తాజాగా నయనతార నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ అన్నపూర్ణ డిసెంబర్ 1 అంటే ఈరోజు గ్రాండ్గా రిలీజ్ అయింది. ఈ మూవీలో న‌య‌న్ ఓ చెఫ్‌గా క‌నిపిస్తుంది.