ఈ మధ్యకాలంలో తెరపై మనం ఎలాంటి సినిమాలు చూస్తున్నామో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కలిసి ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చూడలేకపోతున్నాం. అయితే నాచురల్ స్టార్ హీరో నాని సినిమా వస్తుంది అంటే కచ్చితంగా ఫ్యామిలీస్ కు పండగే కుటుంబమంతా కలిసి చూడొచ్చు అనే అభిప్రాయం ఉంటుంది . కానీ రాను రాను నాని కూడా హద్దులు మీరిపోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .
మరీ ముఖ్యంగా నాని తాజాగా నటించిన హాయ్ నాన్న సినిమాకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది . డిసెంబర్ 7న గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది . ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే స్టోరీలో నాని మృణాల్ ఠాకూర్ రెండు నిమిషాల పాటు ఒళ్ళు మరిచిపోయి హాట్ రొమాన్స్ చేస్తారని.. సినిమాకి ఇదే హైలెట్ సీన్ అని ప్రచారం జరుగుతుంది .
అంతేకాదు ఈ సీన్ చూసి సెన్సార్ సభ్యులు కూడా షాక్ అయిపోయారట . నాని సినిమాలో ఇలాంటి సీనా..? అంటూ ఆశ్చర్యపోయారట. ఫైనల్లీ ఈ సినిమాలో రెండు పదాలతో బూతు మాటలు.. మృణాల్ ఠాకూర్ బ్యాక్ షాట్స్ కట్ చేసి సినిమాకు క్లీన్ యు సర్టిఫికెట్ జారీ చేశారట. దీంతో నాని సినిమాకి యు సర్టిఫికెట్ నా..? అంటూ అభిమానులు సైతం షాక్ అయిపోతున్నారు..!!