అమర్‌కి ఆ సమస్య ఉంది.. సింపతి అనుకుంటారని ట్రీట్మెంట్ మానేశాడు.. తేజస్విని కామెంట్స్ వైరల్

ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 7 రసవతరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ మరికొద్ది వారాల్లో ఫైనల్ కు చేరుతుంది. ఈ నేపథ్యంలో షో మరింత ఇంట్ర‌స్టింగ్‌గా కొనసాగుతుంది. ప్రస్తుతం టైటిల్ రేసులో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ చౌదరి గట్టిగా పోటీ పడుతున్నారు. మొదటి నుంచి ఏ మూసుకు వేసుకోకుండా మాట్లాడుతున్నా అమర్.. తన తింగరి పనుల వల్ల సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురవుతూనే ఉన్నాడు. ఇక హౌస్లో శివాజీ మొదటి నుంచి అమర్‌ని చులకన చేస్తూ.. హార్ట్ చేస్తూనే ఉన్నాడు. కాగా ఇటీవల అమర్ భార్య తేజస్విని ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అమర్‌కు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాల‌న్ని షేర్ చేసుకుంది.

Bigg Boss Amardeep Wife Tejaswini Gowda Reaction on Amar Deep Bigg Boss 7  Telugu |cine theatre - YouTube

ఆమె మాట్లాడుతూ కొన్ని విషయాల్లో శివాజీ గారి ప్రవర్తన వల్ల నేను కూడా బాధపడ్డాను. ఎందుకలా మాట్లాడుతున్నారు.. అనిపించేది. బహుశా అమర్.. టఫ్ కాంపిటేషన్ ఇస్తున్నాడేమో.. అందుకే వాళ్ళు అలా మాట్లాడి ఉంటారు అనుకున్నా. నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినప్పుడు అమర్ కు చాలా చెప్పాలని భావించా. కానీ హౌస్ లోకి వెళ్ళాక అన్నీ మర్చిపోయా. అమర్‌ని చూస్తూ ఉండిపోయా. తనే అందరిని పరిచయం చేశాడు. అమర్‌కు శివాజీ గారు అంటే ప్రత్యేకమైన గౌరవం. నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్లాడు, ఆశీర్వాదం కూడా తీసుకున్నాం అంటూ వివరించింది.

Bigg Boss 7 Telugu: 'Paddodu is never bad'..Amardeep's wife strongly  disagrees.. – Telugu News | Bigg Boss 7 Telugu: Amardeep Wife Tejaswini  Gowda Shares An Emotional Post About His Bigg Boss Journey

ఇక అమర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని చెప్పిన తేజు బిగ్ బాస్ షో కి వెళ్ళకముందు తను విపరీతమైన బ్యాక్ పెయిన్తో బాధపడేవాడని.. హౌస్ లోకి వెళ్లే ఒకరోజు ముందు కూడా అతనికి ఫిజియోథెరపీ చేయించామని చెప్పుకొచ్చింది. నీతోనే డాన్స్ షో ఫినాలే రోజు పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ చేయించుకున్నాడని.. అయితే నొప్పి అనుభవిస్తూనే షో కి వెళ్ళాడని.. ఇప్పటికీ అతడు ఆ నొప్పి అనుభవిస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చింది. అయితే తనకున్న నొప్పి విషయాన్ని ఎవరికీ చెప్పడం లేదని.. ట్రీట్మెంట్ తీసుకోవడం లేదని.. ఎక్కడ సింపతి అనుకుంటారని ఈ విషయాన్ని బయట పెట్టలేకపోతున్నాడు.. నాకు అమర్ ఈ విష‌యం చెప్పాడు అంటూ చెప్పుకొచ్చింది.

Bigg Boss Priyanka upset by Amardeep Wife Tejaswini Gowda's behavior in  Bigg Boss Family Week - Bigg Boss Priyanka: ఏంటి అమర్ మీ ఆవిడ బిహేవియర్..  నాకు మెంటలా.. ఆ మాత్రం అర్ధం కదా? ప్రియాంక ఏడుపు

ఇప్పటికీ తనకు నొప్పి తగ్గడానికి డాక్టర్ రాసి ఇచ్చిన క్రీం పంపిస్తూనే ఉన్నా.. అమర్ రోజు అది రాసుకుంటూనే ఉంటాడు. తనకు కండరాల బలహీనత కూడా ఉంది. ఏదైనా చిన్న దెబ్బ తగిలితే అక్కడ ఫ్రాక్చర్ అవుతుంది అని డాక్టర్స్ వివరించారు. అయినా ఏమీ లేక చేయకుండా టాస్కులు ఆడుతూ ఉంటాడు. మొదట్లో టాస్క్ ల‌ను పెద్దగా ఆడలేకపోయాడు. కానీ తర్వాత ఏదైతే అది అయింది అనుకున్నాడేమో ఆడుతూ వెళ్తున్నాడు అంటూ చెప్పుకొచ్చింది తేజస్విని. ప్రస్తుతం తేజస్విని చెప్పిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.