లేటు వయసులోనూ యాపిల్ బ్యూటీలా భూమిక.. పిక్స్ వైరల్..

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మంచి క్రేజ్‌ను దక్కించుకుంది భూమిక చావ్లా. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించిన ముద్దుగుమ్మ.. 2000లో యువకుడు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత పవన్ నటించిన ఖుషి సినిమాతో సూపర్ హిట్ త‌న ఖాతాలో వేసుకుంది. దీంతో వ‌రుస సినిమా ఆఫ‌ర్లు క్యూక‌ట్టాయి.

అలా టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించింది. ఇక పెళ్లి తర్వాత మెల్లమెల్లగా ఇండస్ట్రీకి దూరమైన ఈ ముద్దుగుమ్మ ఇటీవల రీఎంట్రీ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

పలు సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తున్న ఈ బ్యూటీ తాజాగా సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోషూట్లను షేర్ చేసుకుంటూ కుర్ర కారును ఆకట్టుకుంటుంది. లేటు వయసులోనూ హాట్ బ్యూటీ లా మెరుస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది. ఇటీవల భూమిక షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. క్యాజువల్ లుక్ లో కూడా యాపిల్ బ్యూటీ లా మెరిసిపోతుంది ఈ బ్యూటీ.