” నా గురించి నిజాలు వాళ్లకు తెలుసు..” విడాకులపై ఘాటుగా స్పందించిన చైతు…!!

నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే జంటల్లో సమంత, చైతన్యల‌ జంట ఒకటి. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుని.. అనంతరం పెద్దల అంగీకారంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి వీరిద్దరిపై ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇక ఈ జంట ఎక్కడికి వెళ్ళినా తమ‌ పర్సనల్ లైఫ్ గురించి ప్రశ్నిస్తూ ఉండేవారు ప్రేక్షకులు.

ఇక వీరిద్దరూ విడాకుల తీసుకున్న అనంతరం.. చాలా ఇంటర్వ్యూలలో వీరి విడాకుల గురించి తెలియజేశారు. ఇక దూత ప్రమోషన్స్ లో పాల్గొన్న చైతు మరోసారి వీరి విడాకులపై స్పందించాడు. చైతు మాట్లాడుతూ..” ఒక పాయింట్ తర్వాత.. దాని గురించి నేను పట్టించుకోను. నాతో క్లోజ్ గా ఉన్నవారికి నా గురించి నిజాలు తెలుసు. అయిన.. ఆ విషయాలు పక్కన పెడితే.. నా పర్సనల్ లైఫ్ ద్వారా నేను అందరికీ తెలియడం కంటే.. నా వర్క్ పరంగా.. యాక్టర్ గా అందరూ నన్ను గుర్తించాలని నేను ఆశపడుతున్నాను.

అందుకే నేను నా వర్క్ పై, సినిమాలపై దృష్టి పెట్టాలి అనుకుంటున్నాను. నా సినిమాల ద్వారా నేను ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయాలి. అప్పుడు వాళ్లు నా పర్సనల్ లైఫ్ గురించి కాకుండా నా గురించి మాట్లాడుకుంటారు ” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈయన వ్యాఖ్యలు చూసిన ప్రేక్షకులు…” ఎంత సింపుల్ గా చెప్పినా… సమంత గురించే చెప్పావని అర్థమైపోయింది బ్రో. అదేదో స్ట్రైట్ గానే చెప్పవచ్చుగా…” అంటూ కామెంట్లు చేస్తున్నారు.