విజయ్ దేవరకొండ పెట్టుకున్న ఈ గాగుల్స్ ధర ఎంతో తెలుసా.. రౌడీ హీరో రేంజ్ అంటే అది.. బన్నీ-చరణ్ కూడా వేస్టే..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రెటీస్ కి సంబంధించిన విషయాలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా పలువురు స్టార్ సెలబ్రిటీస్ వేసుకున్న షర్ట్స్ ..ప్యాంట్స్.. ఏ కంపెనీకి చెందినవి ..? వాటి ధర ఎంత అనే విషయాలు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం. మరి ముఖ్యంగా ట్రెండ్ ఫాలో అవ్వకుండా ట్రెండ్ సెట్ చేసే విజయ్ దేవరకొండ ఏ డ్రెస్ వేసుకున్న అది అద్భుతంగానే ఉంటుంది ..

కుర్రాళ్ళు ఆయన వేసుకున్న గాగుల్స్ , వాచ్ ధరను ఎప్పటికప్పుడు ట్రెండ్ చేస్తూనే ఉంటారు . రీసెంట్ గా విజయ్ దేవరకొండ తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్ లో హైదరాబాదులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు . ఈ క్రమంలోనే ఆయన పెట్టుకున్న గాగుల్స్ చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి . అంతేకాదు విజయ్ దేవరకొండకు అప్ట్ గా సూట్ అయ్యాయి.

దీంతో వాటి ధర ఎంత ..? అంటూ జనాలు చర్చించడం ప్రారంభించారు . సెలబ్రిటీ అవుట్ ఫిట్స్ ఢీకొట్ అనే ఇన్స్టా పేజీ ప్రకారం విజయ్ ధరించిన ఈ స్టైలిష్ గాగుల్స్ దాదాపు ఒక్క లక్స 58 వేలు అంటూ తెలుస్తుంది . కేవలం గాగుల్స్ కే లక్షలు పెట్టడం అందరూ ఓవర్ అనుకుంటున్నా.. అది విజయ్ దేవరకొండ రేంజ్ అని ఇప్పటివరకు.. చరణ్ – బన్నీ కూడా అంత కాస్ట్లీ గాగుల్స్ యూస్ చేయలేదు అని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఈ పిక్చర్స్ ని ట్రెండ్ చేస్తున్నారు..!!