మహేష్ బాబు, చిరంజీవి కాంబోలో ఓ సినిమా మిస్ అయిందని మీకు తెలుసా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో భారీ పాన్ వరల్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇలాంటి నేపథ్యంలో మహేష్ బాబు.. మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో ఓ సినిమాను మిస్ చేశాడు అంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. ఆ సినిమా రిజల్ట్ ఏంటో ఒకసారి చూద్దాం.

Mahesh and Chiranjeevi | Mahesh babu, New movies, Superstar

అదే కొరటాల శివ డైరెక్షన్లో రామ్ చరణ్, చిరంజీవి కాంబోలో తెరకెక్కిన ఆచార్య. ఈ సినిమాలో మొదట చరణ్ ప్లేస్ కోసం మహేష్ బాబును అనుకున్నారట. గతంలో కొరటాల శివ, మహేష్ బాబు కాంబోలో రెండు సినిమాలు తెరకెక్కయి. ఆ రెండు సినిమాలు మెసేజ్ ఓరియెంటెడ్ గా రూపొంది కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అందుకున్నాయి. ఈ చొరవతో కొరటాల శివ.. మహేష్ కు ఆచార్య కథను వినిపించాడట. ఈ సినిమాలో మహేష్ – చరణ్ రోల్‌లో నటిస్తే బాగుంటుందని భావించాడట కొరటాల.

Review : Acharya – Strictly for Chiru-Charan | 123telugu.com

అయితే ఈ సినిమా కథను విన్న మహేష్ కథ తేడాగా అనిపించి ఈ పాత్రను సున్నితంగా రిజెక్ట్ చేశాడని తెలుస్తుంది. ఈ సినిమా రిలీజ్ అయి కొరిటాల శివ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ మిగిల్చింది. ఇలా మెగాస్టార్, మహేష్ బాబు కాంబోలో రావలసిన మూవీని.. చరణ్ – చిరు కాంబోలో తరికెక్కించారట‌. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మహేష్ బాబు ఆ సినిమాను రిజెక్ట్ చేసి మంచి పని చేశాడని.. అలాంటి సినిమాల్లో మహేష్ నటించి ఉంటే భారీ డిజాస్టర్ గా తన ఖాతాలో వేసుకుని ఉండేవాడంటూ.. మహేష్ ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.