కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తున్న అనికా సురేంద్రన్.. ఆస్తుల విలువ తెలిస్తే కళ్ళు తేలేస్తారు..!!

బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ గర్ల్ అనికా సురేంద్రన్. ఈ ముద్దుగుమ్మ చిన్ననాటి నుంచే సినిమా ఇండస్ట్రీలో రాణిస్తూ… ప్రస్తుతం ఓ రేంజ్ ఫాలోయింగ్ దక్కించుకుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. 2007లో ” ఛోటా ముంబై ” సినిమా ద్వారా బాలీవుడ్కు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె…” మనే ఐదాల్ , విశ్వాసం” వంటి సినిమాలలో అజిత్ కూతురుగా నటించి ఫుల్ పాపులారిటీని దక్కించుకుంది.

ఇక ఆ తరువాత పుట్టిబొమ్మ, ఓ మై డార్లింగ్ వంటి సినిమాలలో కథానాయకగా నటించింది. ఇక ఈ సినిమాలు మిక్స్డ్ రివ్యూలు అందుకోగా.. కెరీర్ అనుకున్నంత సాఫీగా సాగడం లేదు. కానీ యాడ్స్, సోషల్ మీడియా ద్వారా భారీగానే సంపాదిస్తుంది. ప్రస్తుతం ఏడాదికి రూ. 3 కోట్ల వరకు సంపాదిస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పటివరకు రూ. 16 కోట్ల వరకు కూడబెట్టినట్లు తెలుస్తుంది.

ఇక తెలుగులోను ” బుట్టబొమ్మ ” సినిమాతో డెబ్యూ అయినా ఈమె.. అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక అంతగా ఈమె నటించిన సినిమాలు హిట్ అవ్వకపోయినప్పటికీ… యాడ్స్, సోషల్ మీడియా ద్వారా అంత మొత్తంలో సంపాదించడం చూసి… పలు సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.