” సలార్ ” నుంచి త్వ‌ర‌లోనే రెండో ట్రైలర్ కూడా..!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. శృతిహాసన్ హీరోయిన్గా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ” సలార్ “. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమా నుంచి నిన్న ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ ట్రైలర్ అనంతరం ఈ సినిమాపై భారీ హైప్‌ నెలకొంది. ఇక ఈ సినిమా ట్రైలర్ విషయంలో మరో క్రేజీ బజ్ వినిపిస్తుంది. అదేంటంటే… సలార్ సినిమా నుంచి మరో ట్రైలర్ కూడా రాబోతున్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ రెండో ట్రైలర్ ని సినిమా రిలీజ్ వీక్ లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. అంటే సరిగ్గా రిలీజ్ కి వారం గ్యాప్ లో ఈ ట్రైలర్ ని రిలీజ్ చేస్తారట. మరి ఈ ట్రైలర్ తో ఇంకెంత‌ హైప్ నెలకొంటుందో చూడాలి. ఇక ఈ మూవీ ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.