ఆ సినిమాలో న‌టించినందుకు నాకు ఒక‌ పైసా కూడా రెమ్యున‌రేష‌న్ రాలేదు.. అల్లు అర్జున్ ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్‌..

ఐకాన్‌ స్టార్ అల్లుఅర్జున్ ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పుష్పా సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో భారి పాపులాటి దక్కించుకున్న అల్లు అర్జున్ ఇటీవల నేషనల్ అవార్డ్‌ విన్నర్ గా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం బన్నీ.. సుకుమార్ డైరెక్షన్‌లో పుష్పా 2లో న‌టిస్తున్నాడు. రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాల విషయం పక్కన పెడితే అల్లు అర్జున్ ఏ ఇంట‌ర్వ్యులో పాల్గొన్న కచ్చితంగా తన మొదటి సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటాడు. గంగోత్రి సినిమాతో అల్లు అర్జున్ ఇండస్ట్రీకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా కంటే ముందే కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు బన్నీ. అలా ఆయ‌న‌ నటించిన సినిమాల్లో మొదటిది విజేత. చిరంజీవి హీరోగా నటించిన సినిమాల్లో వెంకటేష్ అనే క్యారెక్టర్లు అల్లు అర్జున్ చైల్డ్‌ఆర్టిస్ట్‌గా నటించాడు. కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో అల్లు రామలింగయ్య సమర్పణలో అల్లు అరవింద్ ఈ సినిమా నిర్మించాడు. ఇక ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన స్వీట్ మెమోరీస్‌ను అల్లు అర్జున్ గుర్తు చేసుకున్నాడు.

అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా డబ్బులివ్వలేదట, అల్లు అరవింద్ పై ఐకాన్ స్టార్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..

విజేత 100 డేస్ షీల్డ్ పట్టుకొని అల్లు అరవింద్ నవ్వుతూ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. నా మొదటి సినిమా విజేత.. దానికి మా డాడీ ప్రొడ్యూసర్ అంటూ రాసుకొచ్చాడు. అంతేకాకుండా.. ఓ మై గాడ్ నాకు ఈ సినిమాకు మా నాన్న డబ్బులు ఇంకా ఇవ్వలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఫ్యాన్స్ అంతా అన్నా నువ్వు ఈ సినిమాకు ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించావా అంటూ.. వెంటనే మీ డాడీని అడిగి తీసేసుకో అన్న అంటూ.. ఫ్యాన్స్‌ ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. ఇక వ‌చ్చే ఏడాది పుష్పా 2 రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాతో బన్నీ మరోసారి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.