చిరు ఇంట్లో షూటింగ్ జరిపిన బాలయ్య మూవీ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు ఈ ఇద్దరు హీరోలు. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వీరిద్దరి ఫ్యాన్స్ మధ్యన ఎప్పటికప్పుడు మా హీరోనే బెస్ట్ మా హీరోనే బెస్ట్ అంటూ కాంపిటీషన్స్ జరుగుతూనే ఉంటాయి. అయితే బాలయ్య, చిరు మాత్రం ఇద్దరు ఎంతో సన్నిహితంగా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకరి ఇంట్లో ఫంక్షన్లకు మరొకరు హాజరవుతూ సందడి కూడా చేసేవారు.

చిరంజీవి, బాలకృష్ణ నటించిన ఆ సినిమాలకు శాటిలైట్ హక్కుల విషయంలో ఇంకా మోక్షం కలగలేదుగా..

ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల బాలయ్య, చిరు మధ్యన కాస్త బాండింగ్ తగ్గింది. అయినా వీరిద్దరూ మంచి స్నేహితులు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే తాజాగా వీరిద్దరికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో బాలకృష్ణ నటించిన ఓ సినిమా చిరంజీవి ఇంట్లోనే షూటింగ్ జరిగిందట. ఇంతకీ ఆ మూవీ ఏంటో ఒకసారి చూద్దాం. బాలకృష్ణ కెరీర్‌లోనే మోస్ట్ క్లాసికల్ మూవీ నారి నారి నడుమ మురారి. 1990 ఏప్రిల్ 27న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ పరంగానే కాకుండా మ్యూజికల్ గాను మంచి సక్సెస్ అందుకున్న ఈ మూవీలో అత్తమామల ఇంటి పక్కనే ఉన్న పాకలో హీరో ఉంటాడు.

Nari Nari Naduma Murari (1989) IMDb, 59% OFF

ఇక్క‌డ‌ అత్తను టీజ్ చేయాల్సిన ఓ సీన్‌ ఉంటుంది. ఇక ఈ సీన్ కోసం ఎంచుకున్న ప్రదేశం సినిమాలోని సన్నివేశాలు తగ్గట్టుగా ఉన్నప్పటికీ.. అది మొత్తం చిరంజీవి గెస్ట్ హౌస్అట‌. అక్క‌డే షూటింగ్ జరిగిందట. ఈ మూవీలో కొన్ని సన్నివేశాలను షూట్ చేయడానికి ఈ ప్రదేశం అయితే బాగా సెట్ అవుతుందని మేకర్స్ చిరుని అడగగా బాలయ్య సినిమా కావడంతో చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట. దీంతో ఈ మూవీ షూటింగ్ కాస్త గెస్ట్ హౌస్‌లో జరిగిన ఈ షూటింగ్ కోసమే ఆ పక్కనే ఉన్న రెండు ఎకరాల భూమిని కూడా కొన్నారంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.