నాగార్జున ఇండస్ట్రియల్ హిట్ శివ మూవీని మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..?

టాలీవుడ్‌లో నాగార్జున నటించిన శివ మూవీ ఇండస్ట్రియల్ హిట్ అన్న సంగతి తెలిసిందే. కమర్షియల్ పరంగా, టెక్నికల్ పరంగా, టేకింగ్ పరంగా ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీని వేరే లెవెల్‌కు తీసుకువెళ్ళింది. రామ్‌గోపాల్ వర్మ మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఈ ఒక్క సినిమాతో ఆర్జీవి ఓ సీనియర్ స్టార్ డైరెక్టర్ కి ఉండేంత క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ మూవీలో చాలా సన్నివేశాలకు ఆర్జీవి వాడిన కెమెరా యాంగిల్స్, కట్స్ హాలీవుడ్ సినిమాల్లోనూ ఈ రేంజ్ లో ఎవ్వరు చూపించి ఉండరు. ఈ మూవీ తర్వాత డైరెక్టర్ గా ఆయనకు బాలీవుడ్ లోను అవకాశాలు వచ్చాయి. అక్కడ కూడా ఎన్నో మంచి సినిమాలను తీసి క్రేజ్‌ సంపాదించుకున్నాడు.

Nagarjuna's 'Siva' Trend Setting Story | cinejosh.com

ఇప్పుడు సందీప్ వంగ ఎలా అయితే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడో అప్పుడు ఆర్జీవి అదే రేంజ్ లో ఉండేవాడు. ఇక టెక్నికల్గా, టేకింగ్ వేరే లెవెల్లో ఉన్న ఈ మూవీ అప్పట్లో ఐదు కోట్ల షేర్ వసూలు చేసింది. అతి తక్కువ ప్రింట్స్ తో విడుదలైనప్పటికీ.. ఈ సినిమా దాదాపు రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. అయితే ఆర్జీవి అప్పటికే కొత్త డైరెక్టర్ కాబట్టి.. ఇతనితో సినిమా తీయడానికి ఎవరు ధైర్యం చేయలేదు. ముందుగా ఈ కథని నాగార్జున హీరోగా భావించలేదట ఆర్జీవి. రొమాంటిక్ లవ్ స్టోరీస్ లో నటించే లవర్ బాయ్ గా కనిపించే నాగార్జున ఈ స్టోరీకి సరిపోతాడని కూడా ఆయన భావించలేదట. అలాంటి హీరోతో ఇంత మాస్ రోల్ అంటే బాగుండదేమో అని ఫీల్ అయ్యాడట.

10 Scintillating looks of Venkatesh over the years in Telugu films! | Times of India

అందుకే కథ‌ విక్టరీ వెంకటేష్ తీయాలని రామానాయుడు కి కథ వినిపించేందుకు గంట పైగా ఎదురు చూశాడు. రామానాయుడు కి స్టోరీని వినిపించిన ఆయన కూడా వెంకటేష్ ఇప్పుడు కుటుంబ కథలు చేస్తున్నాడు. ఇలాంటి టైం లో కొత్త రకమైన టేకింగ్ ఆడియన్స్ కి నచ్చుతుందో లేదో.. వేరే హీరోకి ట్రై చేసుకోండి అని చెప్పేసాడట. అయితే నాగార్జున సినిమాకు సరిపోతాడు అంటూ రికమెండ్‌ చేసింది కూడా రామానాయుడే అని టాక్. దీంతో ఆర్జీవి.. రామానాయుడు లాంటి వ్యక్తి చెప్పిన తర్వాత కూడా స్టోరీ వినిపించకపోతే బాగుండదు అయినా ఇప్పుడే మనం కోరుకున్న హీరో దొరకడం జరగదు అని.. ఆర్జీవి నాగార్జునకు ఆ కథను వినిపించాడట. సింగిల్ సిట్టింగ్ లోనే స్టోరీ ఓకే చేసాడట నాగ్‌. ఆ తర్వాత ఈ సినిమా ఎటువంటి ప్రభంజనం సృష్టించిన అందరికీ తెలిసిందే.