ప‌వ‌న్ ఫ‌స్ట్ వైఫ్ నందినితో ప‌వ‌న్‌కు ప‌రిచ‌యం ఎక్క‌డో తెలుసా.. ప్ర‌స్తుతం ఆమె ఏం చేస్తోందంటే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన పేరు వింటేనే యువత అభిమానంతో ఉర్రూతలు ఊగుతారు. అయితే సినిమా రంగంలో టాప్ హీరోగా రాణిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇక రాజకీయాల్లో ఆయనని బ్లేమ్ చేయడానికి వేరే కారణం ఏదీ లేక ఈయన చేసుకున్న మూడు పెళ్లిళ్ల గురించే అందరూ మాట్లాడుతారు. ఇక ఈయన రెండో భార్య రేణు దేశాయ్.. మూడో భార్య అన్నా లెజినోవా ల గురించి అందరికీ తెలుసు. కానీ పవన్ మొదటి భార్య నందిని గురించి పెద్దగా ఎవరికీ తెలియదు.

పవన్ మొదటిగా తన కుటుంబ సభ్యులు కుదిర్చిన వివాహం చేసుకున్నాడు. ఇక వీరి పెళ్లి ఎంతో అంగరంగ వైభోగంగా జరిగింది. వీరి పెళ్లి జరిగే సమయానికి పవన్ ఇంకా ఇండస్ట్రీలోకి రాలేదు. ఈయన పెళ్లి చేసుకున్న అనంతరం మొదటిగా విడుదలైన మూవీ గోకులంలో సీత. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇక అనంతరం సినిమా కెరియర్ బాగానే సాగుతూ వచ్చింది. మరోవైపు నందిని, పవన్ కళ్యాణ్ లు కూడా కొంతకాలం వరకు బాగానే ఉన్నారు.

ఇక అనంతరం ఏవో మనస్పార్ధాలు వచ్చి పవన్ 1999లో విడాకుల కోసం కోర్టుకు వెళ్ళాడు. కానీ దానికి నందిని ఒప్పుకోలేదు. విడాకులు ఇవ్వడానికి తాను సిద్ధంగా లేదని తెలిపింది. ఇక దీంతో అనంతరం పవన్ సినిమాలతో బిజీ అయ్యాడు. ఇక పూరి డైరెక్షన్ లో వచ్చిన బద్రి సినిమాలో హీరోయిన్గా రేణు దేశాయ్ నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ తరుణంలోనే రేణు దేశాయ్ తో ప్రేమలో పడ్డాడు పవన్. ఇక అనంతరం వీరిద్దరూ కలిసి సహజీవనం చేశారు.

దీంతో కోపం తెచ్చుకున్న నందిని తనకు విడాకులు ఇవ్వకుండానే మరొకరిని పెళ్లి చేసుకున్నారంటూ పోలీస్ కేసు పెట్టింది. ఇక దీంతో పవన్ తాను పెళ్లి చేసుకోలేదని.. సహజీవనం మాత్రమే చేశానని చెప్పడంతో కేసు కొట్టేశారు. ఇక అనంతరం 2007లో పవన్ మళ్లీ విడాకుల కోసం అప్లై చేయగా.. 2008లో విడాకులు ఇచ్చింది నందిని. అయితే భరణం కింద పవన్ కళ్యాణ్ నందినికి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇక ప్రస్తుతం నందిని వారి తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది.