” గుంటూరు కారం ” మూవీకి ఆ సీక్వెన్సే హైలెట్.. ఏదేమైనా మ‌హేష్ మాస్ట‌ర్ ప్లాన్ అదుర్స్‌..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ బ్యాక్డ్రాప్‌తో లో తెరకెక్కుతుంది. మహేష్ బాబు ఈ సినిమాలో ఎన్నడు కనిపించని విధంగా మాస్ ప్రొఫైల్ తో కనిపించబోతున్నాడు. అదేవిధంగా సినిమాలో కామెడీ ట్రాక్ హిలేరియస్ గా ఉండబోతుందట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ కామెడీ సీక్వెన్స్‌ సినిమాకి హైలైట్ నిలవబోతుందని తెలుస్తుంది.

వెన్నెల కిషోర్, శ్రీలీల, మహేష్ బాబు కాన్వర్జేషన్ లో వచ్చే ఈ సీక్రెట్స్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైనింగ్‌గా ఉండబోతుందట. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకి రిలీజ్ చేయబోతున్నారు. మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న మూవీకి మ్యూజిక్ సెన్సేషన్ థ‌మన్ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. అయితే మూవీలో మీనాక్షి చౌదరి పాత్ర సెకండ్ హాఫ్ లో వస్తుందట.

గుంటూరు మిర్చి యార్డ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతోందని సమాచారం. మహేష్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడా మాస్ క‌ట్స్‌తో త్రివిక్రమ్ ఈ స్టోరీని ప్లాన్ చేశాడట. హారికా అండ్‌ హసిన్ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. మహేష్ కెరీర్‌లోనే 28వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి,