బిగ్ బాస్ టైటిల్ కొట్టేసిన రైతుబిడ్డ.. ఈ షో ద్వారా ఎంత సంపాదించాడంటే..?

బిగ్‌బాస్‌ సీజన్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచిన సంగతి తెలిసిందే. ప్రతి మనిషిలో ఓక‌టైన త‌ప్పు ఉంటుంది. అదే విధంగా రైతుబిడ్డ కూడా హౌస్ లో కొన్ని తప్పులు చేశాడు. నామినేషన్స్ అప్పుడు ఒకలా.. సాధారణ టైంలో మరోలా.. ప్రవర్తించి ప్రేక్షకులను కాస్త చిరాకు పెట్టిన తర్వాత అతడే ఆటను సరిదిద్దుకున్నాడు. ఓ సామాన్యుడిగా ఆటలో తన సత్తా చూపించాడు. ఎవరెంత రెచ్చగొట్టిన ఒదిగి ఉంటూ తన ఆటను ఆడాడు. ఫోక‌స్ మొత్తం టాస్క్‌ల‌పై పెట్టాడు. మాటలతో కాకుండా తన ఆటతో విన్నింగ్ చూపించాడు. ఆపొనెంట్స్‌కి చెమటలు పట్టించే విధంగా ప్రశాంత్ ఆట ఉంది.

అయితే ప్రశాంత్ చాలా ఎమోషనల్ పర్సన్.. చిన్న చిన్న విషయాలకు కూడా కుంగిపోయేవాడు. ఓటమిని తీసుకోలేడు. మొదట్లో సింపతి గేమ్ అని అందరు భావించారు.. కానీ తర్వాత అది అతడి సున్నితమైన త‌త్వం అని అందరికీ అర్థం అయింది. ఎవరి మాట లెక్కచేయకుండా గెలుపు మీద దృష్టి పెట్టిన ప్రశాంత్ చివరికి అనుకున్నది సాధించాడు. ప్రశాంత్ టైటిల్ గెలవడంతో స్టేజ్ మొత్తం కరతాల ధ్వనులతో మారుమోగిపోయింది. అయితే ఈ షో ద్వారా ప్రశాంత్ మొత్తంగా ఎంత సంపాదించాడో ఒకసారి చూద్దాం. ప్రశాంత్ షో ద్వారా అందుకున్న రెమ్యూనరేషన్ తక్కువగానే ఉంది.

రోజుకు రూ.15 వేలు మాత్రమే ప్రశాంత్ కు బిగ్ బాస్ హౌస్ లో ఇచ్చారు. ఈ లెక్కన వారానికి లక్ష పైచిలుకు కాక 15 వారాలకు రూ.15,75,000 పల్లవి ప్రశాంత్ కు అందినట్లు తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ విజేతగా రూ.50 లక్షల ప్రైజ్ మనీ అందుకోవాల్సిన పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ రూ.15 లక్షల సూట్ కేస్ తీసుకుని బయటకు రావడంతో.. రూ.30 లక్షలు అందుకున్నాడు. ఇందులో టాక్స్, జీఎస్టీ పోగా అతని చేతికి 17 లక్షల మాత్రమే అందాయట. మరి ఈ రేంజ్ లో కటింగ్స్ ఉంటాయా అంటే ఉంటాయి అనే సమాధానం వస్తుంది. బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ వీజే స‌న్ని స్వయంగా విషయాన్ని వివరించాడు.

తనకు రూ.50 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వాల్సిందని కానీ ఇందులో దాదాపు రూ.27 లక్షల వరకు ప్రభుత్వమే తీసుకుందని టాక్స్ కట్ చేసుకున్న తర్వాతే మిగిలిన డబ్బు నాకు ఇచ్చారంటూ వివరించాడు. ఈ లెక్కన బిగ్ బాస్ నుంచి పల్లవి ప్రశాంత్‌కు మొత్తంగా రూ.32 లక్షల పైచేలుకు నగదు అందింది. అలాగే ఖరీదైన మారుతి బ్రజా కార్, రూ.15 లక్షలు విలువ చేసే డైమండ్ నెక్లెస్ ను సొంతం చేసుకున్నాడు. అదేవిధంగా అందుకున్న రెమ్యూనరేషన్ కి కూడా టాక్స్ కటింగ్స్ ఉంటాయట. ఈ కటింగ్స్ కూడా పోతే ప్రశాంత్ కి మొత్తంగా రూ.25 లక్షలు మాత్రమే చేతికి వెళ్ళాయి.