మహేష్ ” గుంటూరు కారం ” నుంచి మరో లీక్… మండిపడుతున్న ఫ్యాన్స్…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా మహేష్ నటిస్తున్న మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక ఈ సినిమాలో శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ భారీ చిత్రాన్ని త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నాడు. ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ మూవీ ఆఖరి దిసకు చేరుకుంది. అయితే ఈ సినిమా విషయంలో మాత్రం మొదటి నుంచి ఏదో ఒక లీక్ బయటకు వస్తూనే ఉంది. రీసెంట్ టైంలో అయితే ఈ లీక్స్ మరింత ఎక్కువయ్యాయి. అలాగే ఇక్కడ మరింత ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే ఈమధ్య లీకైన అన్ని కూడా మహేష్ పై సాంగ్స్ కి సంబంధించినవే కావడం గమనార్హం.

ఇక ఇప్పుడు కూడా మహేష్ మరియు శ్రీలీల పై డాన్స్ బీట్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. మరి ఇంత జరుగుతున్న మేకర్స్ నుంచి ఎటువంటి మూమెంట్ కనిపించడం లేదు. ఇక ఇవన్నీ తెలిసి జరుగుతున్నాయో లేదా తెలీక జరుగుతున్నాయో ఫ్యాన్స్ కి అర్థం కావడం లేదు. ఇక ప్రస్తుతం ఈ లీక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.