‘ సలార్ ‘ మూవీ ప్రమోషన్స్ లో రాజమౌళి.. జ‌క్క‌న స్పెషల్ ఇంటర్వ్యూ వీడియో వైరల్..

పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మూవీ స‌లార్‌. ఈ సినిమా రెండు పార్ట్‌లుగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. కేజిఎఫ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో శృతిహాసన్ హీరోయిన్గా పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ కీలకపాత్రలో నటిస్తున్న ఈ మూవీ ఫ‌స్ట్ పార్ట్ స‌లార్ సీజ్ ఫైర్ డిసెంబర్ 22న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్స్ రెండు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమా ఎప్పుడు ఎప్పుడు చూద్దామా అని ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్, ప్రమోషన్స్ ను భారీగా మేకర్స్ ప్లాన్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ రిలీజ్ కు ఇంకా రెండు రోజులే ఉన్న ఎటువంటి మూవీ ప్రమోషన్స్ జరగలేదు.. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ అంతా నిరాశ చెందారు. అయితే గత కొద్దిరోజులుగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ‌మౌళి.. సలార్‌ టీమ్‌ను ఇంటర్వ్యూ చేయబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే అందరూ అనుకున్నట్టుగానే తాజాగా సలార్ మూవీ యూనిట్ ఇంటర్వ్యూ జరిగిన వీడియోను తమ ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చారు.

ఇందులో సలార్ షూటింగ్‌లో జరిగిన విషయాల, కేజీఎఫ్, స‌లార్‌, బాహుబలి సినిమాల గురించి వాటి మేకింగ్ గురించి, అదే విధంగా ప్రభాస్‌కి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను రాజమౌళితో షేర్ చేసుకున్నారు మూవీ టీం. ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృధ్వీరాజ్ సుకుమారన్ ఈ ఇంట‌ర్వ్యులో జ‌క్క‌న‌తో క‌లిసి సంద‌డి చేశారు. ఎటువంటి భారీ ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేయకుండా సింపుల్గా రాజమౌళితో ఇలాంటి బ్లాక్ బస్టర్ కంటెంట్ ఇంటర్వ్యూతో స‌లార్‌ను ప్రమోట్ చేయడంతో ఫ్యాన్స్ అంతా ఆశ్చ‌ర్యపోతున్నారు.