దేవర మూవీపై అనిరుధ్ బ్లాస్టింగ్ అప్డేట్‌.. పులికి అందరూ సలాం కొడతారు అంటూ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్‌ ఇండియా స్టార్ హీరోగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడం.. అది కూడా కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కడంతో.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

Anirudh LineUp • #Vettaiyan :... - Kerala Box Office | Facebook

ఇక ఇప్పటివరకు ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో.. ఫ్యాన్స్ అంతా ఏదైనా అప్డేట్ వస్తే బాగుండు అని ఆకలితో ఎదురుచూస్తున్నారు. 2 ఏళ్ళ‌ నుంచి తమ అభిమాన హీరో వెండితెరపై కనిపించకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న తారక్ ఫ్యాన్స్ కోసం ఇన్నాళ్ళకి సాలిడ్ అప్డేట్ మేకర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ బ్యూటిషన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి కేవలం ఒక పోస్టర్ మాత్రమే రిలీజ్ అయింది.

కాగా ఈ సినిమా టీజర్ త్వరలోనే ప్రేక్షకులు ముందుకి రాబోతుందంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న అనిరుధ్.. టీజర్ రెడీ అయినట్లుగా హింట్ ఇచ్చాడు. అనిరుద్ ఇచ్చిన హింట్ ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానుల్లో మరింత జోష్ పెంచింది. దేవర టీజర్ సంబంధించి అనిరుద్ మంగళవారం సాయంత్రం పెట్టారు. దేవర టీజర్ అని రాసిపెట్టి పక్కన క్లాప్స్‌ కొడుతున్నట్లు ఎమోజీలు పెట్టాడు.

ఎన్టీఆర్, కొరటాల శివ అన్ ఫైర్ అంటూ ఎమోజీలను షేర్ చేసుకున్నాడు. వెరీ ఎక్సైటెడ్ అంటూ మ్యూజిక్ ఎమోజిలు పెట్టాడు. దీన్నిబట్టి టీజర్ కి అనిరుధ్‌ మ్యూజిక్ కంప్లీట్ అయిందని చెప్పుకొచ్చాడా లేదా.. టీజర్ కంప్లీట్ అయిందని వివరించాడో తెలియదు కానీ.. ఈ మెసేజ్ కు హాష్ ట్యాగ్ ఆల్ హేయిల్‌ ద టైగర్ అని చెప్పుకొచ్చాడు. దాని అర్థం ఏంటంటే పులికే అందరూ సలాం కొడతారు అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం అనిరుధ్‌ ఇచ్చిన ఈ అప్డేట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మంచి కిక్‌ ఇచ్చింది. ఎన్టీఆర్‌ను దృష్టిలో పెట్టుకొని అనిరుధ్ ఈ ట్యాగ్ ఇచ్చాడంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.