పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. గుడ్ న్యూస్ చెప్పిన ప్రియాంక జైన్..

బిగ్‌బాస్ సీజన్ 7లో టాప్ 5 కంటెస్టెంట్ గా ప్రియాంక జైన్ పాపులారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. బుల్లితెరపై పలు సీరియల్ లో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి తన అద్భుతమైన ఆటతీరుతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ప్రియాంక జైన్ కు శివకుమార్ అనే బాయ్ ఫ్రెండ్ ఉన్న సంగతి తెలిసిందే. శివకుమార్ కూడా ఇప్పటికే బుల్లితెరపై పలు సీరియల్ లో హీరోగా న‌టించాడు. ఇక హౌస్ లో పేరెంట్స్ వీక్ అప్పుడు కూడా తల్లిదండ్రుల ప్లేస్ లో ప్రియాంక కోసం శివకుమార్ హౌస్‌లోకి అడుగు పెట్టాడు.

Priyanka Jain Bio New Movies Big Boss 7 news – SACHIVALAYAM

ప్రియాంకకు బూస్టప్‌ ఇచ్చాడు. ఇక హౌస్ లో ఉన్నప్పుడు ప్రియాంక పెళ్ళెప్పుడు చేసుకుందామని అడగగా శివకుమార్ హౌస్ నుంచి రాగానే చేసుకుందామంటూ సమాధానం ఇచ్చిన సంగతి తెలిసింది. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రియాంక మాత్రం పెళ్లి విషయంపై షాకింగ్ సమాధానం ఇచ్చింది. పెళ్లంటే సాధారణ విషయం కాదు.. మేము కెరీర్‌లో సెటిల్ అవ్వాలి అంటూ ఇంటర్వ్యూలో వివరించింద‌ది. దీంతో చాలామంది ఫ్యాన్స్ నిరాశ చెందారు.

Janaki Kalaganaledu Fame Priyanka Jain To Marry Boyfriend Shivakumar  Marihal Soon? - Filmibeat

అయితే తాజాగా ఈ జంట పెళ్లి పై క్లారిటీ ఇచ్చేశారు. పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు చెప్పేశారు. ఇక ప్రస్తుతం ఈ జంట కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నార‌ట‌. డేటింగ్ లో ఉన్న ప్రియాంక జైన్‌, శివకుమార్ వచ్చే ఏడాది అంటే 2024 లో ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటామని ఓ వీడియో ద్వారా షేర్ చేసుకున్నారు. అంటే మరికొద్ది రోజుల్లో అయినా కావచ్చు.. లేదా 2024 డిసెంబర్ వరకు అయినా ఆగవచ్చు.. కానీ ఖచ్చితంగా రాబోయే ఏడాది వీరిద్దరి వివాహం జరగబోతుంది. ఈ విష‌యం తెలిసిన ప్రియాంకా జైన్‌, శివకుమార్ ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.