హోస్ట్‌గా నాగార్జున ప‌నికిరాడు.. ఆయ‌న చేయ‌లేని ప‌ని బ‌జ్‌లో నేను చేస్తున్న‌.. గీతు రాయ‌ల్

గత సీజన్‌ల‌తో పోలిస్తే బిగ్ బాస్ సీజన్ 7 మ‌రింత‌ సక్సెస్ అందుకుంది. ఉల్టా పల్టా అంటూ వచ్చిన ఈ సీజన్ బోల్డని సర్ ప్రైజ్‌ల‌తో డిఫరెంట్ టాస్కులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాగార్జున హౌస్ట్‌గా వివరించిన సంగతి తెలిసింది. అయితే బిగ్ బాస్ ఎంత స‌క్స‌స్‌ అయిందో అదే రేంజ్‌లో బిగ్ బాస్ బ‌జ్ కూడా అదే రేంజ్ లో ప్రేక్షక ఆదరణ పొందింది. బిగ్ బాస్ సీజన్ 6 కంటిస్టెంట్‌గా ఉన్న గీత రాయల్ ఈ సీజన్ కు హోస్ట్‌గా వ్యవహరించింది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గీతు మాట్లాడుతూ నాగార్జున హోస్టింగ్ గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.

Bigg Boss Fame Geethu Royal SH0CKING Comments On Nagarjuna | Geethu Royal  Exclusive Interview | NQ - YouTube

ఆమె మాట్లాడుతూ హౌస్ట్‌గా నాగార్జున ప‌నికిరాడు అని.. ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే నాగార్జున హౌస్ట్‌గా వ్యవహరిస్తున్నా ఆయన ఓ స్క్రిప్ట్ ని ఫాలో అవుతారు.. అప్పటివరకు నాగార్జునకు స్క్రిప్ట్ ఉంటుందని నేను అసలు అనుకోలేదు.. నేను ఉన్న సీజన్ లో కూడా ఇదే జరిగింది. నాకు, చండికి మధ్య గొడవ జరిగినప్పుడు తప్పు నాది లేకపోయినా.. నాదే తప్పని ఒప్పించడానికి నాగార్జున‌ ప్రయత్నించాడు. అదంతా స్క్రిప్ట్ అని నాకు అప్పుడు తెలియదు.

ఒక హోస్ట్ గా షో చూసిన తర్వాత ఏది తప్పు ఏది ఒప్పు అని ఆయన అభిప్రాయం చెబితే బాగుండేది.. కానీ ఆయన అలా చేయలేదు.. నా ఒక్క విషయంలోనే కాదు చాలామంది కంటిస్టెంట్ల విషయంలో ఇదే జరిగింది. ఒక రివ్యువ‌ర్‌గా నాకు ఏమనిపించింది అంటే ఆయన ఏదో అడిగేస్తారు.. కడిగేస్తారు.. అనుకున్న కానీ ఆయన కూల్ గా వచ్చి హాయ్ హలో అంటూ మాట్లాడేస్తాడు. తప్పు చేస్తే ఖండించడం కూడా తెలియడం లేదు.. ఆయన ఎలా రియాక్ట్ అవ్వాలి ఏంటి అనేది కూడా స్క్రిప్ట్ పైనే బేస్ చేసుకుని ఉంటారు.

వాడుకోవడం అలవాటేగా.. గీతూ ప్రశ్నలకు బిక్కముఖం వేసిన రతిక | Bigg Boss 7  Telugu Buzz: Highlights Of Geetu Royal BB Exit Interview With Rathika Rose,  Promo Goes Viral - Sakshi

ఒక హౌస్ట్‌గా నాగార్జున అన్ని పాయింట్లను కవర్ చేయడం కష్టం.. కాబట్టి నేను బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున అడగలేని వాటన్నిటిని అడుగుతున్నా.. ఆడియన్స్ నాకు చాలా ప్రశ్నలు సెండ్ చేస్తారు.. వాటినే నేను కంటిస్టెంట్స్‌ ని అడుగుతా. నా ప్రశ్న‌ల‌తో క్లారిటీ తీసుకుంటా. ఆడియన్స్ కి క్లారిటీ ఇస్తా.. నాకు ఒకసారి హోస్ట్‌గా అవకాశం వస్తే చాలని భావించా.. ఛాన్స్‌ వచ్చింది. కాగా బిగ్ బాస్ సీజన్ 7 కి హోస్ట్‌గా నాగార్జున ఫెలయ్యారని సీరియల్ బ్యాచ్‌కు సపోర్ట్‌గా మాట్లాడుతున్నారని ఎప్పటినుంచి సోషల్ మీడియాలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.