పెళ్ళికి ముందే ప్రియుడితో అది ప్లాన్ చేసిన త‌మ్మ‌న‌.. అడ్డంగా దొరికిపోయిందిగా..

మిల్కీ బ్యూటీ తమన్న బాలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ వర్మతో రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. లాస్ట్ స్టోరీస్ 2 సిరీస్ ద్వారా కలిసిన నటించిన ఈ జంట ఈ మూవీ షూటింగ్ టైంలో ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు. ప్రస్తుతం విజయ్, తమన్నా ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తమన్న, విజయ్ కలిసి చట్టపట్టలేసుకుని తిరుగుతూ చాలా సార్లు కెమెరా కళ్ళకి చిక్కారు. తాజాగా ఈ జంట మరో టూర్ కి ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. నటుడు విజయ్ వర్మ, హీరోయిన్ తమన్నా మ‌ధ్య ఎఫైర్‌లు నడుస్తున్నాయంటూ ఈ ఏడాది మొదటి నుంచే వార్తలు వినిపించాయి.

మధ్యలో ఈ వార్తలు ఖండించిన తమన్నా తర్వాత కూడా విజయ్ తో కలిసి చాలాసార్లు కనిపించడం కెమెరా కంటికి చిక్కడంతో.. కొన్నాళ్లు సీక్రెట్ మైంటైన్ చేసినా చివ‌రికి తమ రిలేషన్ షిప్ ఓపెన్ అయ్యారు. అవును మేమిద్దరం ఇష్టపడడం.. డేటింగ్ లో ఉన్నామంటే చెప్పుకొచ్చారు. వారిద్దరు లవ్ ఎప్పుడు మొదలైంది.. ఎలా ఒకటయ్యారనే అంశంపై కూడా ఎన్నో ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నారు. ఇక అప్పటినుంచి ఖాళీ దొరికితే చాలు ఈ జంట ఏకాంతంగా ఎక్కడికోచోటికి ట్రిప్స్ వేస్తూనే ఉన్నారు.

Vijay Varma and Tamannaah Bhatia make for such a good looking couple, and  this mushy photoshoot is just ❤️❤️❤️. Double tap if you're… | Instagram

తాజాగా మరో టూర్ ప్లాన్ చేశారు ఈ కపుల్. ఇద్దరు వేరు వేరు కార్లలో ముంబై ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. మీడియా వాళ్ళు చుట్టుముట్టడంతో అడ్డంగా దొరికిపోయారు. కాగా పెళ్లికి ముందే కలిసి జీవించడం ఇష్టమైన ప్రదేశాల్లో వివరించడం.. ఇటీవల కాలంలో కామన్ అయిపోయింది. బాలీవుడ్‌లో ఈ కల్చర్ ఎప్ప‌టినుంచో ఉంది. శృతిహాసన్ ఒకరితో సహజీవనం చేస్తుంది. అలియాభట్ త‌ల్లి అయ్యాక రణ్‌బీర్ కపూర్ ని పెళ్లి చేసుకుంది. ఇక ఈ జంట కూడా త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని టాక్ నడుస్తుంది.