300 కోట్ల బడ్జెట్ తో బన్నీ నెక్స్ట్ సినిమా ఫిక్స్ చేసుకున్న స్టార్ డైరెక్టర్.. ఇక త్రివిక్రమ్ నెత్తిన తడిగుడ్డే..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు చిన్నచితక సినిమాలు చేయడానికి ఇష్టపడడం లేదు. పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్నాక గ్లోబల్ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాక అందరూ కూడా ఆ రేంజ్ సినిమాలనే యాక్సెప్ట్ చేస్తున్నారు . అల్లు అర్జున్ – చరణ్ – తారక్ – ప్రభాస్ లాంటి హీరోలు అయితే ప్రతి ఒక్క సినిమా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కే విధంగా చూసుకుంటున్నారు . అయితే ప్రెసెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్న తారక్ తన నెక్స్ట్ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ రావుతో కమిట్ అయిన విషయం తెలిసిందే.

కానీ సోషల్ మీడియాలో సరికొత్త క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు సినిమాను పక్కన పెట్టేసి మరో క్రేజీ డైరెక్టర్ కి కాల్ షీట్స్ ఇచ్చేశాడు అల్లు అర్జున్ అంటూ ప్రచారం జరుగుతుంది . రజినీకాంత్ జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో ఇటీవల మీట్ అయిన బన్నీ స్టోరీ వినగా ..ఆ స్టోరీ బాగా నచ్చేసిందట . పుష్ప సినిమా తర్వాత అలాంటి క్రేజీ హిట్ పడాలి అంటే ఇలాంటి కాన్సెప్ట్ కచ్చితంగా అవసరం అని …

త్రివిక్రమ్ కి చెప్పి మరి ఈ సినిమాకు సైన్ చేశాడట . దీంతో త్రివిక్రమ్ సినిమా లేటుగా తెరకెక్కబోతుంది . అంతేకాదు ఈ సినిమాలో బన్నీ డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడట . అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట మేకర్స్. దీంతో పుష్ప తర్వాత అలాంటి ఓ క్రేజీ హిట్ మళ్లీ అందుకోబోతున్నాడు బన్నీ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..!!