నయనతారకు గూబ గుయ్యమనే షాక్ ఇచ్చిన పూజా హెగ్డే..సపోర్ట్ చేసిన బన్నీ.. దెబ్బ అదుర్స్ అంతే..!!

సినిమా ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ కోసం రాసుకున్న కథను మరో హీరోయిన్ చేస్తూ ఉండడం సర్వసాధారణం. మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అలా ఒక హీరోయిన్ కోసం రాసుకున్న కథను మరో హీరోయిన్ చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి . అలాంటి సినిమాలు హిట్ అయ్యాయి . మరికొన్నిసార్లు ఫట్ అయ్యాయి . అయితే మన కోసం రాసుకున్న కథను వేరే హీరోయిన్ చేసి హిట్టు కొడితే ఆ బాధ వర్ణాతితం.

అలాంటి బాధను ఎన్నోసార్లు రుచి చూసింది నయనతార. కాగా పూజ హెగ్డే కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్ హిట్ గా నిలిచిన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో హీరోయిన్గా ముందుగా హారిష్ శంకర్ నయనతారను అనుకున్నారట . అమ్మడు హై రేంజ్ రెమ్యూనరేషన్ అడగడమే కాకుండా బన్నీకి మించిపోయే రేంజ్ లో ఈ సినిమాలో తన సీన్స్ ఉండాలి అంటూ కండిషన్స్ పెట్టిందట .

ఇన్ని కండిషన్స్ విన్న హరీష్ శంకర్ – బన్నీ ఆమెను సినిమాలో నుంచి తీసేయడమే ఉత్తమం అంటూ రిజెక్ట్ చేసేసారట . ఆ తర్వాత అప్పుడప్పుడే పాపులారిటీ దక్కించుకుంటున్న పూజా హెగ్డేను లైన్ లో పెట్టారు . ఈ సినిమా ఆమెకు ఎంత సక్సెస్ ఇచ్చిందో ఆ తర్వాత బుట్ట బొమ్మగా మారడానికి ఎన్ని ఛాన్స్ లు ఇచ్చిందో మనకు తెలిసిందే..!!