రష్మిక కంటే ముందే విజయ్ ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా..? మనం డైలీ తెరపై చూస్తూనే ఉంటాం..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ప్రజెంట్ ఫ్యామిలీ స్టార్ అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఆ తర్వాత విజయ్ తిన్నూరి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలోనూ పాల్గొనబోతున్నాడు . బ్యాక్ టు బ్యాక్ ఫుల్ టు ఫుల్ రొమాంటిక్ – ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలను చూస్ చేసుకున్న ఈ హీరో అర్జున్ రెడ్డి లాంటి సినిమాలో మళ్లీ నటిస్తే చూడాలి అన్నది ఫ్యాన్స్ కోరిక. అయితే ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో ఆ దేవుడికి తెలియాలి .

ప్రెసెంట్ విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండ రష్మిక మందన్నాలు ప్రేమించుకుంటున్నారు అని.. పెళ్లి చేసుకోబోతున్నారు అని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది . అయితే ఎప్పటికప్పుడు వీళ్ళిద్దరూ ఆ విషయాలను కొట్టి పడేస్తూనే వచ్చారు . కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం రష్మిక మందన్నా కంటే ముందే విజయ్ దేవరకొండ ఓ టాప్ హీరోయిన్ ని ప్రేమించాడు అన్న వార్తలు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . ఆమె మరెవరో కాదు రితూ వర్మ .

పెళ్లిచూపులు సినిమాతో హీరోయిన్గా మారిన ఈమె అభిమానులకు మంచి సుపరిచితురాలు . చాలా అందంగా ఉంటుంది . బాగా నటిస్తుంది . కానీ హిట్ ట్రాక్ మాత్రం ఎక్కలేకపోయింది . వీళ్ళిద్దరి కాంబోలో పెళ్లిచూపులు సినిమా వచ్చింది . ఈ సినిమా మూమెంట్లో వీళ్ళిద్దరి మధ్య చనువు చూసి ప్రేమించుకుంటున్నారు అంటూ జనాలు చర్చించుకున్నారు . ప్రమోషన్స్ లో భాగంగా వీళ్ళు మెలిగిన తీరు అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది.

అయితే రీతు వర్మకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉండడంతో ఆమె విజయ్ ను ..విజయ్ ప్రేమను పెద్దగా పట్టించుకోలేదట. ఆశ్చర్యం ఏంటంటే ఎన్నో సినిమాలు చేసిన రితూవర్మ హిట్ లు అందుకోలేకపోవడం తో.. ఆమె బాయ్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు అంటూ ప్రచారం జరిగింది. ప్రజెంట్ తనదైన స్టైల్ సినిమాలో నటిస్తున్న రీతు వర్మ మెగా ఇంటికి కోడలు కాబోతుంది అంటూ కూడా ప్రచారం జరిగింది . రీసెంట్ గానే దానిపై క్లారిటీ కూడా ఇచ్చింది రీతు వర్మ..!!