చక్కెర కంటే మధురంగా ఉండే ఈ మొక్క షుగర్ పేషెంట్లకు దివ్య ఔషధం అని తెలుసా.. ?

హిందూ సంప్రదాయంలో తులసి మొక్కను దేవ‌త‌గా పూజిస్తూ ఉంటారు. ఇంట్లో తులసి మొక్క ఉంటే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయని హిందువులు నమ్ముతూ ఉంటారు. అలాగే తులసి మొక్కను ఔషధ మొక్కగా కూడా వాడుతుంటారు. తుల‌సి ఆకు రసం తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. పలు ఔషధాలు లోను తులసి ఆకులను వాడుతూ ఉంటారు. అయితే తులసి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి కృష్ణ తులసి, ఒకటి రామ తులసి. ముదురు రంగు ఆకును కృష్ణ తులసి అని పిలుస్తూ ఉంటారు. ఇక‌ తులసి ఆకుల తో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.

కడుపులో నొప్పి, హార్ట్ సంబంధించిన వ్యాధులు, మలేరియా లాంటి హానికరమైన జ్వరాలు, జ‌లుబు , ద‌గ్గు నుంచి కూడా తులసి ఔషధంలా పనిచేసే ఉపసమనాన్ని కల్పిస్తుంది. అలాంటి తులసిని మూలికల రాణిగా పిలుస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు తులసి లోనే తీపి తులసి ఎక్కడ దొరుకుతుంది.. దానివల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయో ఒకసారి చూద్దాం. మన ఇంటి వద్ద సాధారణంగా ఉండే తులసిలో విటమిన్ ఏ, విటమిన్ డి, ఐరన్, ఆర్సినిక్ యాసిడ్ లాంటి లక్షణాలు కలిగి ఉంటాయి. అయితే ఈ తీపి తులసి రకం పేరు స్టేవియా.

ఈ తులసి ఆకులు వేసిన నీళ్లను తాగితే జీర్ణ వ్యవస్థను శాంతి పరిచి మెరుగైన జీర్ణక్రియ కలిగిస్తుంది. ఈ తులసిలో కూడా విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, ఫైబర్ లాంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. తినడానికి ఇష్టపడే వారికి ఇది ఒక వారం. స్టేవియా నిజానికి పొద్దుతిరుగుడు కుటుంబానికి చెందింది. దాదాపు 240 జాతులు ఉన్న‌ స్టేవియా యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉండడం వల్ల.. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

షుగర్ రోగులకు కూడా ఇది మేలు చేస్తుందట. ఈ తులసిని చాలా ఏళ్లుగా స్వీట్నర్ గా వాడుతున్నారు. అలాగే ఈ తీపి తులసి బ్యాక్టీరియా లక్షణాలు ఉన్న ఎక్సిమా, డెర్మటైటిస్ వంటి సమస్యలను తగ్గించడానికి కీలక పాత్ర వహిస్తుందట. ఈ తులసి బరువును కూడా తగ్గిస్తుందని, సహజంగా బరువు తగ్గాలంటే మీ ఆహారంలో ఈ తుల‌సిన చేర్చుకుంటే మంచిదని తెలుస్తుంది. ఇది కడుపుకి కూడా మేలు చేస్తుంది. చాలా ఎఫెక్ట్ గా పని చేస్తుంది. కడుపు నొప్పి, అజితి లాంటి సమస్యలకు సులభంగా చెక్ పెడుతుంది.