నాగచైతన్య ” ఏ మాయ చేసావే ” సినిమా నటి మృతి… బాధలో కూరుకుపోయిన చైతు…!!

సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరో సీనియర్ నటి మృతి చెందింది. దక్షిణాది సీరియల్ నటి సుబ్బలక్ష్మి (87) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈమె.. కచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు.

ఈ విషయాన్ని ఈమె కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేశారు. ఈమె మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఇక ఈమె తెలుగులో నాగచైతన్య హీరోగా నటించిన ” ఏ మాయ చేసావే ” సినిమాలో ఓ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే చైతు ఈమెకి బాగా క్లోజ్ అయ్యారట.

ప్రస్తుతం ఈ వార్త విన్న చైతు సైతం కృంగిపోయాడు. ఇక ఈమె మృతి సినీ ప్రముఖులని బాధిస్తుంది. దక్షిణ భారతదేశ నుంచి ఆల్ ఇండియా రేడియోలో పనిచేసిన తొలి లేడీ కంపోజర్ గా రికార్డ్ సృష్టించిన సుబ్బలక్ష్మి.. తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో… మొత్తం 70కి పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.