ఈ ఇద్దరి ప్లేస్ లో ఆ ఇద్దరు ఉండి ఉంటే.. సినిమా ఇంకా మంచి హిట్ అయ్యేదా..?

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే యానిమల్ సినిమా పేరు ..సినిమా రివ్యూలే హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా సందీప్ రెడ్డివంగా దర్శకత్వం కావడం అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ తెరపై ఈ సినిమా ద్వారానే ఆయన డైరెక్షన్ చూడడంతో అభిమానులు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సందీప్ రెడ్డివంగా ఈ సినిమాతో ఇంకొక మెట్టు పైకి ఎక్కడానే చెప్పాలి.

ఈ సినిమాలో తండ్రి పాత్రలో అనిల్ కపూర్.. కొడుకు పాత్రలో రన్బీర్ కపూర్ సూపర్ గా నటించారు . సినిమా మొత్తానికి వీళ్ళ పర్ఫామెన్స్ హైలెట్గా నిలిచింది . వీళ్లిద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ సీన్స్ అభిమానుల చేత కన్నీరు తెప్పిస్తాయి. ఈ సినిమా చూసిన జనాలు అనిల్ కపూర్ ప్లేస్ లో ప్రకాష్ రాజ్ – రణ్బీర్ కపూర్ ప్లేస్ లో మహేష్ బాబును ఊహించుకుంటున్నారు .

దూకుడు సినిమాలో ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ ఎంత వర్కౌట్ అయిందో మనం చూసాం . ఈ సినిమాలో కూడా వాళ్ళిద్దరూ నటించి ఉంటే సినిమా మరింత స్థాయిలో తెలుగు అభిమానులకు నచ్చేది అని.. చెప్పుకొస్తున్నారు . నిజానికి సందీప్ రెడ్డివంగా ఈ సినిమా కథను మొదటిగా మహేష్ బాబుకు వినిపించారు . కానీ ఆయన రిజెక్ట్ చేశారు . ఆ తర్వాత ఈ సినిమా పలువురు హీరోల చేతికి వెళ్లి లాస్ట్ కి రన్బీర్ కపూర్ చేతికి వెళ్ళింది..!!