నారింజ తొక్కల పొడితో మెరుగైన ముఖ సౌందర్యం… ఆ చిన్న టిప్ పాటిస్తే చాలు…!!

నారింజ తింటే ఆరోగ్యంతో పాటు అందం పెరుగుతుంది. పండు తో పాటు నారింజ తొక్కలు సైతం అందాన్ని రెట్టింపు చేస్తాయి. నారింజ తొక్కల పొడిని స్కిన్ కేర్ రొటీన్ లో ఉపయోగించడంతో అనేక లాభాలు పొందవచ్చు. నారింజ తొక్కల పొడిని ఉపయోగించి క్లిన్నింగ్ చేసుకుంటే మొటిమల సమస్య తొలగిపోతుంది. నారింజ తొక్కల పొడి బ్యాక్‌హెడ్స్ తగ్గిస్తుంది.

అలాగే మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాను సైతం కంట్రోల్ చేస్తుంది. నారింజ తొక్కల పొడి చర్మాన్ని మెరుగుపరుస్తుంది. ఈ పొడిని ఉపయోగించడంతో చర్మం నిత్యం యవ్వనంగా ఉంటుంది. అలాగే ఈ పొడి తో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా చర్మానికి అందుతాయి.

 

నారింజ తొక్కల పొడిలో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ గా మార్చడంలో సహాయపడుతుంది. అలాగే ఈ తొక్కల పొడిని స్కిన్ కేర్ రొటీన్ లో ఉపయోగించడం వల్ల చర్మం రంగు కూడా మారుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ నారింజ తొక్కల పొడిని తప్పకుండా ఉపయోగించండి.