చలికాలంలో వచ్చే పగుళ్లకు చెక్ పెట్టండి ఇలా…!!

చలికాలంలో పొడిగాలుల కారణంగా మడాల పగుళ్లు వస్తాయి. ఇంటి చిట్కాలతో వాటిని ఈజీగా తొలగించుకోవచ్చు. వాసెలిన్ లో కాసింత నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి కాళ్ళ పగుళ్లు ఉన్నచోట రాస్తే పగుళ్లు తగ్గుతాయి. అలాగే అరటిపండు, తేనె అప్లై చేసిన పగుళ్లు తగ్గుతాయి.

కొబ్బరినూనె లో రాతి ఉప్పు కలిపి మడాళ్ళకు అప్లై చేయడం వల్ల కూడా కాళ్ల పగుళ్లు తగ్గుతాయి. అలాగే విక్స్ మడాళ్ళకు అప్లై చేసి… వేడినీళ్లలో మసాజ్ చేస్తే కాళ్ల పగుళ్లు తగ్గుతాయి. ప్రతి ఒక్కరికి చలికాలంలో పగుళ్లు అనేవి వస్తూనే ఉంటాయి.

వీటి కోసం అనేక ఆయిల్మెంట్లు.. ప్రతి ఒక్కరూ వాడుతూ ఉంటారు. అవన్నీ వాడినప్పటికీ పెద్దగా ఫలితం దొరకకపోవచ్చు… కానీ ఇప్పుడు చెప్పిన చిట్కాలను వాడితే తప్పకుండా ఫలితం లభిస్తుంది. పైన చెప్పిన సింపుల్ చిట్కాలను ఫాలో అయ్యి… మీ మడాల పగుళ్లను మాయం చేసుకోండి.