యానిమల్ సినిమా కోసం రష్మిక ఎన్ని కోట్లు తీసుకుందో తెలుసా..? కెరీర్ లోనే హైయెస్ట్ ప్యాకేజ్..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్స్ హీరోలకు మించిన రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు . మరీ ముఖ్యంగా టాప్ ఫైవ్ హీరోయిన్స్ అయితే హీరోలకు మించిన రేంజ్ లోనే కుసింత ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు . తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. అదే లిస్టులోకి వచ్చింది. నిన్న మొన్నటి వరకు సినిమాకి రెండు కోట్లు మూడు కోట్లు తీసుకుంటూ వచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా యానిమల్ సినిమా కోసం ఏడు కోట్లు చార్జ్ చేసింది అన్న విషయం వైరల్ గా మారింది .

అంతే కాదు కెరియర్ లోనే ఇది ఆమెకు హైయెస్ట్ ప్యాకేజీ అంటూ కూడా జనాలు చెప్పుకుంటున్నారు. సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో తెరకెక్కిన అనిమల్ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయింది . ఈ సినిమా కోసం రష్మిక మందన్నా ఏకంగా ఏడు కోట్లు చార్జ్ చేసింది అన్న వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం హిట్ తన ఖాతాలో వేసుకునింది రష్మిక .

ఇదే ఊపు కొనసాగిస్తే సినిమాకి 10 కోట్లు కూడా చార్జ్ చేస్తుందేమో అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ప్రజెంట్ రష్మిక తెలుగులో రెండు సినిమాలు..బాలీవుడ్ లో మూడు సినిమాలు.. కోలీవుడ్ లో ఒక్క సినిమా చేస్తుంది. త్వరలోనే రిలీజ్ కాబోతున్న పుష్ప 2 ద్వార మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉంది ఈ ముద్దుగుమ్మ..!!