బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ రాధిక ఆప్టే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం జెట్ స్పీడ్ తో కెరీర్‌లో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. సీనియర్ స్టార్ హీరోయిన్స్ ఎంతమంది ఉన్నా.. కొత్త బ్యూటీలు ఎంతమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన.. అదే క్రేజ్‌తో కొనసాగుతుంది. థియేటర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. ఆన్ స్క్రీన్ నుంచి ఆఫ్ స్క్రీన్ వరకు ప్రతి చోటా తన మార్క్ క్రియేట్ చేసుకుంటుంది. సినిమాలు, టెలివిజన్ షో, వెబ్ సిరీస్ ఇలా అన్నిటిలోనూ సందడి చేస్తోంది. టాలెంటెడ్ బ్యూటీగా క్రేజ్‌ను సంపాదించుకుంది.
ఇష్టమైన సినిమాలో గెస్ట్ రోల్ అయినా సరే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతుంది. తాజాగా అలాంటి ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాధిక. షూటింగ్ పూర్తికాకుండానే ఈమె పని అయిపోయింది. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన మేరీ క్రిస్మస్ అనే సినిమాలో రాధిక ఆప్టే ఓ కీలక పాత్రలో నటించింది. కీలకపాత్ర అంటే ఓ అయిదారు సన్నివేశాలు ఉంటాయి అనుకుంటారేమో.. లేదు. ఈ సినిమాలో రాధికకి కేవలం ఒక సీన్ మాత్రమే ఉందట. మరి ఒక్క సన్నివేశంతో కీలకపాత్ర ఎలా అవుతుంది అంటూ రాధికకు ఓ ప్రశ్న ఎదురయింది. దీనికి మంచి లాజిక్ తో సమాధానం చెప్పుకొచ్చింది రాధిక.
ఈ పాత్ర ఒప్పుకోవడానికి ఆ సినిమా దర్శకుడు మాత్రమే కారణమట. అతను ఆమెకు మంచి మిత్రుడు కావడంతో ఆఫర్ ను రిజెక్ట్ చేయడం ఇష్టం లేక ఓకే చెప్పేసిందట. అలాగే ఆయన ప్రతి సినిమాలో కామన్‌గా రాధిక కనిపిస్తూ ఉంటుందట. ఓ రోజు ఫోన్ చేసి నీది ఒక సీన్ పరిమితమైన పాత్ర చేస్తావా అని అడిగితే ఇంకేం మాట్లాడకుండా ఎస్ చెప్పేసా అంటుంది. కనిపించేది ఒక్క సీన్ లోనైనా షూటింగ్ కోసం మాత్రం నేను రెండు రాత్రులు షూటింగ్లో పాల్గొనాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రాధిక చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.