జూనియర్ ఎన్టీఆర్‌కు చుక్కలు చూపిస్తున్న జాన్వి.. పెద్ద షాక్ ఇచ్చిందిగా..!!

జాన్వి కపూర్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… అక్కడ ప్రేక్షకులని పెద్దగా అలరించలేకపోయింది. దీంతో బాలీవుడ్ లో పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. ఇక జాన్వి టాలీవుడ్ ఇండస్ట్రీ వైపుకు మళ్ళింది. ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” దేవర ” సినిమాలో హీరోయిన్ గా అవకాశాన్ని కొట్టేసింది.

ఇక హీరోయిన్ గా పెద్దగా ఆకట్టుకోకపోయినా.. ఎన్టీఆర్ కి గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉందట. ఈ సినిమా షూటింగ్ సమయంలో గోవాలో జాన్వి కపూర్ ని పెట్టి ఓ సాంగ్ ని షూట్ చేశాడట కొరటాల శివ. ఆ సాంగ్ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్, జాన్వి గట్టి పోటీని ఇచ్చుకున్నారట. వీరిద్దరూ కూడా మంచి క్లాసికల్ డాన్సర్. చిన్నప్పటి నుంచే శాస్త్రీయ నృత్యం లో శిక్షణ తీసుకుని ఎన్టీఆర్, జాన్వి మంచి డాన్సర్స్ అయిపోయారు. ఇక వీరిద్దరూ కలిసి ఒకే పాటకి డాన్స్ చేస్తే ఎవరు బాగా చేస్తున్నారు అనేది చెప్పడం చాలా కష్టం.

జాన్వి ఇప్పటికి చేసింది చాలా తక్కువ సినిమాలు అయినా.. గ్లామర్ పరంగా ఈ ముద్దుగుమ్మ కి ఫ్యాన్స్ ఎక్కువగానే ఉన్నారు. ఆఫ్ స్క్రీన్ లో ఈ ముద్దుగుమ్మ చేసే గ్లామర్ షోస్ అంతా ఇంతా కాదు. ఇక డాన్స్ విషయంలో ఎన్టీఆర్ కి గట్టి పోటీనే ఇస్తుందట జాన్వి. దీంతో ఎన్టీఆర్ కి చుక్కలు కనిపిస్తున్నాయి. ఇలాంటి అమ్మాయి దేవర సినిమా కోసం పల్లెటూరి ఆడపిల్లగా మారిపోయింది. ఇక ఈ సినిమా ఏప్రిల్ 5న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ‌