శంకర్-చరణ్ “గేమ్ చేంజర్” సినిమా ఆ తెలుగు హీరో కధనా..? ఇదేం ట్విస్ట్ రా బాబు..!!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న తాజా సినిమా “గేమ్ చేంజర్” . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది . ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . శంకర్ అఫీషియల్ అప్డేట్ ఇచ్చింది చాలా తక్కువ . జనాలే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని పిక్స్ ను లీక్ చేసేసారు .

దీంతో ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి . అయితే గేమ్ ఛేంజర్ సినిమాను శంకర్ ముందుగా తెలుగులో ఉండే ఓ బడా హీరో కోసం రాసుకున్నారట. ఆ హీరోకి కథ కూడా వివరించారట . ఆ హీరోకి కూడా కథ నచ్చింది. అయితే కాల్ షీట్స్ అడ్జస్ట్ అవ్వని కారణంగా ఆ హీరో ఈ సినిమాను హోల్డ్ లో పెట్టాడు . ఈ లోపే శంకర్ ఆ సినిమాను చరణ్ వరకు వచ్చేలా ఓ బడా ప్రొడ్యూసర్ ప్లాన్ చేశాడు .

దీంతో ఆ తెలుగు హీరో ఖాతాలో నుంచి చరణ్ ఖాతాలోకి గేమ్ చేంజర్ వచ్చేసింది. ఆ హీరో మరెవరో కాదు బన్నీ . అల్లు అర్జున్ కోసం శంకర్ రాసుకున్న కథను ప్రొడ్యూసర్ చేతులు మార్చేసి చరణ్ చేతికి చిక్కేలా చేశాడు. ఈ సినిమా హిట్ అయితే బన్నీ మంచి సినిమాను మిస్ చేసుకున్నట్టు..ఒక్కవేళ్ల ఫ్లాప్ అయితే బన్నీ సో లక్కీ అని చెప్పాలి..!!